తెలంగాణ

జాతీయ రహదారుల విస్తరణకు రూ. 1200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, నవంబర్ 19: కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల నిధుల మంజూరుకు క్లియరెన్స్ తీసుకోనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివా రం బాన్సువాడ - బోధన్ రహదారిలో ఆర్టీసీ డిపో సమీపంలో ప్రధా న రహదారిపై 4కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బి వంతెనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నర్సాపూర్ నుండి బాసర వరకు జాతీయ రహదారుల విస్తరణ కోసం 600 కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించి మంజూరు చేయించుకున్నామన్నారు. అలాగే మెదక్ నుండి బాన్సువాడ మీదు గా రుద్రూరు వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల నిమిత్తం మరో 600 కోట్ల నిధుల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పం పించామని, త్వరలోనే ఆ నిధుల జారీకి క్లియరెన్స్ లభిస్తుందన్నారు. రుద్రూర్ నుండి పొతంగల్ మీదుగా మద్నూర్‌కు రోడ్డు విస్తరణ కోసం నిధుల మంజూరుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మొదటి విడతగా నర్సాపూర్ నుండి బాసరవరకు రోడ్డువిస్తరణ పనులను చేపడుతామని, రెండవ విడుతగా మెదక్ నుండి రుద్రూర్ వరకు రోడ్డు పనులను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని జాతీయ హైవేలుగా రూపాంతరం చేసి ప్రజలకు సురక్షిత రవాణా సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభు త్వం చిత్తశుద్ధితో ముందుకు పోతుందన్నారు. జాతీయ రహదారుల రోడ్ల విస్తరణతో దీర్ఘకాలంగా ఉన్న రోడ్ల సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందన్నారు.
పాతవి తీసేసి కొత్త వంతెనను నిర్మిస్తాం
జిల్లాలో చాలా ఏళ్ల క్రితం వేసిన పాత వంతెనలు శిథిలావస్థ దశ కు చేరుకున్నాయని, దాంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని, వంతెనలు ఇరుకుగా ఉండటం వల్ల తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు కొత్త వంతెనల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి పోచారం స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలోని నెలీ, అంకోల్, కొత్తాబాదీ, రుద్రూర్, అక్భర్‌నగర్ తదితర ప్రాంతాల్లో కొత్త వంతెన ఏర్పాట్లకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని చెప్పారు. బాన్సువాడ ఆర్టీసీ డిపో సమీపంలో నాలుగు కోట్లతో చేపట్టిన ఆర్‌అండ్‌బి వంతెన నిర్మాణ పనులను సకాలంలో ఏడాదిలోపు పూర్తి చేసి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ఆర్‌అండ్‌బి కామారెడ్డి ఇఇ అంజయ్యతో పాటు గుత్తేదారును మంత్రి పోచారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్, టిఆర్‌ఎస్ బాన్సువాడ నియోజక వర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, ఎఎంసీ చైర్మెన్ నార్ల సురేష్, బాన్సువాడ సర్పంచ్ వాణి విఠల్, టిఆర్‌ఎస్ నాయకులు దుద్దాల అంజిరెడ్డి, జంగం గంగాధర్, ఎజాజ్, కో-ఆప్షన్ సభ్యుడు బాబా, ఎర్వల కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, దాసరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.