తెలంగాణ

రాజకీయ చైతన్యంతోనే రాజ్యాధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 19: రాజకీయ చైతన్యంతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఈ విషయాన్ని బీసీలలోని అన్ని కులాలకు సంబంధించిన నాయకులు గ్రహించాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శారదగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బీసీల ఆత్మగౌరవం మేలుకోనా బిసి అనే మహాసభను నిర్వహించారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున వివిధ కులసంఘాల నాయకులు, విద్యార్థులు, మేదావులు తదితరులు హజరయ్యారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలు తమ ఓటును ఓ తెల్లకాగితంలా భావించకూడదని ఓటుఅంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సీటు అనే భావన రావాలని తెలిపారు. అప్పుడే బీసీలు చట్టసభల్లో అధికంగా ఉంటారన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఉద్యోగ రంగాల్లో 9శాతం మాత్రమే ఉన్నారని రాజకీయ రంగాల్లో ప్రజాప్రతినిధులుగా 14శాతం కూడా దాటలేదని వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఒకశాతం కూడా దాటలేదని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29మంది ముఖ్యమంత్రులు పాలిస్తే అందులో ఒక్క బీసీ కూడా లేరని ఇలాంటి దౌర్భగ్య పరిస్థితి ఉందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 29రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కూడా బీసీలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాజాధికారం సాధించడమే ధ్యేయంగా బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని గతంలో హక్కుల కోసం, సంక్షేమం కోసం పోరాటలు చేశామని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎంతైన ఉం దని బీసీలలోని 112 కులాల ప్రజలు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంద ని ఇప్పటివరకు 104 కులాల్లో ఒక్కరు కూడా చట్టసభల్లోకి అడుగుపెట్టలేదని తెలిపారు. కొన్ని వర్గాలు రాజకీయాన్ని వ్యాపారంగా మల్చుకుని బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారని ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారు గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఎప్పుడు కూడా ఏ రాజకీయ జెండా మోసిన వారిని కాదని ఆ పార్టీల జెండాలను పట్టుకుని గ్రామాల్లో తిరగలేదని అయితే తనకు టీడీపీ, బీజేపీ పార్టీలు సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వెనుక తన వెంట బీసీ జనబలం ఉన్నందుకే ఆ రెండు పార్టీలు గుర్తించాయన్నారు. ఈ వేదిక నుండి తాను అన్ని రాజకీయ పార్టీల్లోని బీసీ నాయకులు జనబలం గల నాయకులుగా తయారు కావాలని తమ జనం తో బహిరంగసభలు, ప్రజాచైతన్యయాత్రలు సమాజం కోసం నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలని అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు మీ ఇంటికి వచ్చి టిక్కెట్ ఇస్తామని చెప్పుకునే స్థాయికి వస్తాయని లేకుంటే ఎవరూ పట్టించుకోరనే విషయాన్ని గ్రహించాలన్నారు.
తాను ఈ వేదిక నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నానని చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెట్టి దేశంలో 50శాతంకు పైగా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంగ్లోఇండియన్‌లకు లోక్‌సభలో 5నామినేట్ పోస్టు లు, చట్టసభల్లో ఒక్క నామినేట్ పోస్టును ఇస్తున్నారని దేశంలో బీసీలకు ఎందు కు ఆ అవకాశం ఇవ్వడం లేదని అదే తరహాలో ప్రతి అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేతో పాటు లోక్‌సభలో కూడా 10నామినెటెడ్ పదవులు ఇవ్వాలని ఆయ న డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిసి సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా బీసీ మంత్రిత్వశాఖను విద్యా, ఉద్యోగరంగాల్లో 27శాతం నుండి 56శాతంకు పెం చాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లక్షమందితో మహబూబ్‌నగర్‌లో బిసి మహాగర్జనను నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు రెండు స్థానాలు రిజర్వేషన్ల కేటగిరిలో ఉండగా మిగతా 12స్థానాల్లో బీసీలే గెలిచి చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే ఇలాంటి జిల్లాలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధి అనే ప్రక్రియ ఏ ప్రభుత్వం అయిన చేస్తుందని కానీ రాజ్యాధికారం అనే ప్రక్రియ మాత్రం ఆ జాతులు చైతన్యమై తమ ఓటును తమ వర్గాలకే వేసుకునేలా నిర్ణయాధికారానికి ఎదగాలన్నా రు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శారదగౌడ్ మాట్లాడుతూ తాము ఈ బహిరంగసభను నిర్వహిస్తుంటే కొందరు సభను భగ్నం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నారని వాటికి భయపడకుండా సభను విజయవంతం చేసుకున్నామన్నారు. భవిష్యత్తులో పాలమూరు జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం బిసిలను ఏకతాటిపైకి తెస్తూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తుందని బిసిలుగా చెప్పుకునేవారు బీసీలకే వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహారిస్తే వారిని రాజకీయ సమాధి చేసి జవసత్వా లు గలవారిని జాతి నుండి కొత్తరాజకీయ నాయకులను తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌పి వెంకటేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మణెమ్మ, డీసీసీ నాయకుడు సంజీవ్‌ముదిరాజ్, బిసి సంక్షేమ సంఘం నాయకులు పిరికిళ్ల శ్రీను, దశరథం, కుర్మయ్య, రామలింగం, వివిధ సంఘాల నేతలు, మంత్రి నరసింహ, వెంకటేష్, రాందాస్, కరుణాకర్‌గౌడ్, సాజిదా సికిందర్ తదితరులు పాల్గొన్నారు.