తెలంగాణ

103 స్థానాలు మావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీపనగండ్ల, నవంబర్ 19: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాల్లో 103 స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మిగిలిన సీట్లలో ప్రతిపక్షాలు ఎంఐఎం దక్కించుకుంటుందని అన్నారు. ఆదివారం చిన్నంబావి మండల పరిధిలోని బెక్కెం గ్రామంలో టీఆర్‌ఎస్ నేత ధారాసింగ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రు లు మారినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం మూడేళ్లలోనే సీఎం కేసీఆర్ ఎనలేని అభివృద్ధి చేశారని అన్నారు. అభివృద్ధిని చూసి పార్టీలో వలస పరం పర కొనసాగుతుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో కేవలం నాయకులు మాత్రమే మిగులుతారని అన్నా రు. ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని ఎన్నికల వరకు తుపా నులా టీఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతాయని అన్నారు. ఈ తుపానులో టీడీపీ, కాంగ్రెస్ కొట్టుకుపోవాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఇప్పటికే కనుమరుగైందని, కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని అన్నారు. రాబోయే పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్రంలో 5వేల గ్రామ పం చాయతీలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, అన్నింటిలో గ్రామాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. అంతకుముందు బెక్కెం గ్రామంలో రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాల సందర్భం గా అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలను మంత్రి జూపల్లి ప్రారంభించారు. మంత్రి వెంట టీఆర్‌ఎస్ నేత ధారాసింగ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంచంద్రరెడ్డి, మాజీ జడ్పీటీసీ కృష్ణప్రసాద్ యాదవ్, సర్పంచులు బీచుపల్లి, ఖాధర్, టీఆర్‌ఎస్ నాయకులు రామస్వామి, ఎత్తంబాలస్వామి, గోవిందుయాదవ్, శ్రీను, కురుమూర్తి, కృష్ణయ్య, నాగరాజు, గోపి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బెక్కెంలో అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి జూపల్లి