తెలంగాణ

పాలేరులో త్రిముఖ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 25: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ జరగనుంది. అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థిగా జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత శాసనసభ్యులు, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి పోటీ చేస్తారని ఆ పార్టీలు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా సోమవారం సిపిఎం అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు పోటీ చేస్తారని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థికి తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
కాగా బిజెపి, బిఎస్పీలు పోటీ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సిపిఎం అభ్యర్థి సుదర్శన్‌రావుకు మద్దతునిస్తున్నట్లు సిపిఐ ప్రకటించింది. అయితే మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలుస్తుండటంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
అధికార పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు నియోజకవర్గంతో సత్సంబంధాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత బలం చేకూర్చనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డికి తన భర్త వెంకటరెడ్డిపై ఉన్న ప్రజాభిమానానికి తోడు సుదీర్ఘకాలంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల మద్దతు బలం చేకూర్చనున్నాయి. సిపిఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన సుదర్శన్‌రావుకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉంది. గత ఎన్నికల్లోనూ సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసి 44వేల ఓట్లు సాధించిన ఆయనకు ఈసారి సిపిఐ మద్దతు ఇవ్వటం, వరుసగా రెండోసారి పోటీలో ఉండటం, నియోజకవర్గంలో సిపిఎం బలమైన క్యాడర్‌ను కలిగి ఉండటం కలిసొచ్చే అంశాలు.