తెలంగాణ

తెలిసి చెప్పకున్నా నేరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: లైంగిక దాడులతో చిన్నారుల బాల్యం ఛిద్రమవుతోందని, బాలికలపై లైంగిక దాడులను అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం బాలికలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా పీపుల్స్ ప్లాజాలో చిన్నారులు వాక్‌థాన్ నిర్వహించారు. ఈ వాక్‌థాన్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, లైంగిక దాడులపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని, పోక్సో యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఎక్కడైనా చిన్నారులపై లైంగిక దాడి జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసినా..పోలీసులకు సమాచారం ఇవ్వని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. వందలాది మంచి విద్యార్థులు పాల్గొన్న ఈ వాక్‌థాన్ ర్యాలీ పీపుల్స్ ప్లాజా నుంచి సంజీవయ్య పార్కు వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో షీ టీమ్స్ చీఫ్ స్వాతిలక్రా, నగర ఇన్‌చార్జి పీసీ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో సోమవారం జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి