తెలంగాణ

సమాజాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కాచిగూడ, నవంబర్ 20: సమాజాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయులేనని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రముఖ విద్యావేత్త డా. చుక్కా రామయ్య రచన - తరగతి గది అంతరాత్మ ‘మొదటి పాఠం’ పుస్తకావిష్కరణ సభ సోమవారం రవీంద్ర భారతిలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం సభ్యుడు జూలూరి గౌరీ శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ విద్యనందించాలనే ఉద్దేశంతో ఐఐటిని స్థాపించారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో స్వయంగా తెలుసుకున్న తన అనుభావాలను పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. నవ సమాజ నిర్మాణం ఎలా ఉండాలో పుస్తకంలో వివరించారని తెలిపారు. రామయ్య రచించిన పుస్తకం నేటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకని, ఉపాధ్యాయ వృత్తిపైనే గౌరవం పెరిగే విధంగా ఉందన్నారు. తెలంగాణలో 542 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న తెలంగాణ ప్రభుత్వన్ని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషను బోధన భాషగా చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి తెలుగు భాష, సంస్కృతిని విస్మరిస్తున్నారని వాఖ్యనించారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రామయ్య రచించిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసి విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. తరగతి గది సమాజ మార్పుకు దోహద పడుతుందని తెలిపారు. విద్యను వ్యాపారంగా చూసే వ్యవస్థ పోవాలని అకాక్షించారు. ఆడపిల్ల చదువుకుంటే కుంటుంబం మొత్తం చదువుకుంటుందని, ఆడపిల్లలను చదివించాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం రావాలని అందరికి నాణ్యమైన విద్యనందించాలని తెలంగాణ ప్రభుత్వం కెజీ టూ పీజీ విద్య విధానం రూపొందించడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 542 గురుకుల పాఠశాలలను ఏర్పాటు అందరిని నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు చెప్పారు. రామయ్య రచించిన పుస్తకాన్ని గ్రంథాలయ సంస్థ ద్వారా కొనుగొలు చేసి ప్రతి ఉపాధ్యాయులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ విలువలను పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ప్రభుత్వ చీఫ్‌విప్ సుధాకర్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎ.చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాక్షి ఎడిటర్ రాంచంద్ర మూర్తి పాల్గొన్నారు.

చిత్రం..మొదటి పాఠం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న భారత ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు తదితరులు