తెలంగాణ

ప్రతి పేదోడికి కార్పొరేట్ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 20: ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించి, ప్రభుత్వ దవాఖానాలల్లో సకల సదుపాయాలు కల్పించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డికె అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని నిమ్స్ తరహాల రూపొందించి, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించి, సామాన్యుడికి కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టాక కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించామని, జిల్లాలో కిడ్నీ వ్యాధిబారిన పడిన రోగుల కోసం కొత్తగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, దీని వల్ల జిల్లాలో సుమారు 300 మంది కిడ్నీ రోగులకు వైద్యం అందుతుందని అన్నారు. ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో అన్ని రకాల వైద్య పరికరాలు ఏర్పాటు చేశారని, వైద్యులను కేటాయించాలని, అలాగే ఆసుపత్రిలో అదనపు పడుకలు ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని వారు పరిశీలించి, రోగుల వార్డులలో పర్యటించి వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల మార్కెట్ యార్డు చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, ఆసుపత్రి సూపరింటెండెట్, పీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బండల పద్మావతి, ఎంపీపీ సుభాన్, మున్సిపల్‌కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం పరిశీలిస్తున్న మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే డీకే అరుణ