తెలంగాణ

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 20: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి, కోటి ఎకరాల మాగాణీగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా తోర్నాలలో 9.36 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం, బాలుర, బాలికల వసతి గృహ సముదాయాలను మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డితో కలసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పోచారం మాట్లాడుతూ ఆత్మహత్యలు లేని, ఆకుపచ్చ తెలంగాణను చూడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యల గురించి ఎక్కువగా మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఆత్మహత్యలకు కారణం ఆలోచించాలన్నారు. వ్యవసాయరంగంపై కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్లనే అన్నదాతల ఆత్మహత్యలని, ఈ పాపం ముమ్మాటికే కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. నిజాం పాలనలో తెలంగాణలో రెండు పంటలు పండగా గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో నీళ్లు లేక భూములు బీళ్లుగా మారాయన్నారు. వచ్చే కొత్తసంవత్సరం నుండి 24 గంటలు విద్యుత్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుకు పెట్టుబడి, నీళ్లు, కరెంట్ అందించి అన్ని విధాల చేయూతనిస్తుందన్నారు. రైతులు పండించిన పంటలకు సైతం గిట్టుబాటు ధరను కల్పించేందుకు కృషిచేస్తుందన్నారు. రైతు సమన్వయ కమిటీలు మొక్కుబడిగా, అలంకారప్రాయం కాకుండా రైతులను అభివృద్ధి చేసే విధంగా కృషిచేయాలన్నారు. రసాయన ఎరువులతో సాగుభూములు నిస్సారమయ్యాయన్నారు. రసాయనిక ఎరువులు వినియోగించడంలో తెలంగాణ సర్కార్ రెండవ స్థానంలో ఉందన్నారు. రైతులను సేంద్రియ ఎరువులు వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ పెట్టుబడులు తగ్గించేలా, అధిక దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత రైతు సమన్వయ కమిటీలదేనన్నారు. రైతులు అప్పుల ఊబి నుండి ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని బతికేలా సర్కార్ కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, వైస్ చాన్సలర్ ప్రవీణ్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్, ఉద్యానవనాధికారి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సిద్దిపేట జిల్లా తోర్నాలలో సోమవారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు తదితరులు