తెలంగాణ

పోరుగడ్డ నుంచే కేసీఆర్‌పై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 20: విప్లవాల పోరుగడ్డ నల్లగొండ జిల్లా రైతు పోరు దీక్ష నుండే తెలంగాణ వ్యాప్తంగా రైతు, ప్రజా ఉద్యమాలను ఉదృతం చేసి నియంత సీఎం కెసిఆర్ ప్రభుత్వంపై టిడిపి యుద్ధం ఆరంభిస్తుందని టి.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన రైతు పోరుదీక్ష ఆద్యంతం వేలాది మంది కార్యకర్తలు, రైతులతో ఉదయం నుండి సాయంత్రందాక విజయవంతంగా సాగింది. మోత్కుపల్లికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించాక కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన సందర్భంలో టిడిపి శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట సాగగా నాయకులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించడంతో ముట్టడి ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల ముఖ్య నాయకుల వలసలతో డీలా పడిన పార్టీ క్యాడర్‌లో రైతు దీక్ష కదనోత్సహాన్ని రగిలించింది. ఎల్.రమణ, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్‌లు, నన్నూరిలతో పాటు ఇతర నాయకులంతా ఉర్రూతలూగించే ప్రసంగాలతో కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి క్యాడర్‌లో జోష్ నింపారు. జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత ఎలిమినేటి ఉమామాధవరెడ్డి రైతు దీక్షకు గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. రైతు దీక్షలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తుందన్నారు. పత్తి, ధాన్యం, మిర్చి రైతులకు మద్ధతు ధరను అందించడంలో విఫలమైందని రైతులను ఆదుకునేందుకు టిడిపి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ముట్టడిస్తామన్నారు. కర్షకుల కనె్నర్రలో కెసిఆర్ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకే జాతీయ ఫ్లోరైడ్ రీసెర్చ్ ప్రాజెక్టు కేటాయించాలని టిడిపి కేంద్రాన్ని కోరనుందన్నారు.
మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల సమస్యలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదన్నారు. తెలంగాణలో టిడిపి లేదంటున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల సంగతి తేల్చేందుకు, టిడిపి సత్తా చాటేందుకు బడుగు, బలహీన వర్గాలు, పేదల రాజ్యం తెచ్చేందుకు తాను అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్నారు. తెలంగాణలో టిడిపి లేదన్న పార్టీలనే రాజకీయంగా బొంద పెట్టేందుకు టిడిపి నల్లగొండ గడ్డ నుండే రైతు దీక్షతో యుద్ధ్భేరి మ్రోగించిందన్నారు. అన్ని జిల్లాల్లో ఇదే రకంగా రైతులు, ప్రజా సమస్యలపై టిడిపి ఉద్యమాలు ఉధృతం చేస్తుందన్నారు. కోట్లారూపాయలు కూడబెట్టిన జిల్లా కాంగ్రెస్ నాయకులు జానా, ఉత్తమ్, కోమటిరెడ్డి, జగదీష్‌రెడ్డి, గుత్తా, దామోదర్‌రెడ్డి వంటివారంతా ఒకవైపు మాదిగ బిడ్డ మోత్కుపల్లి మరోవైపు ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో పెత్తందారులకు ఓట్లేస్తారా లేక బడుగుల రాజ్యాధికార సాధనకు టిడిపికి చెందిన బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులకు ఓట్లేస్తారా అన్ననినాదంతో ప్రజల్లోకి వెళుతామన్నారు.
టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతు అసెంబ్లీలో రైతు సమస్యలపై నిలదీస్తే ప్రభుత్వం నిర్లక్ష్యంగా సమాధానిలిచ్చిందే తప్ప ఆదుకునే చర్యలు ప్రకటించలేదన్నారు. టిడిపి అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతు కోటి రూపాయల పంట పండించే ఆదర్శ రైతు కెసిఆర్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు సాగుతున్నాయో చెప్పాలన్నారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంధ్రశేఖర్ మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వంలో నాటిన మొక్కలు, వదిలిన చేప పిల్లలు లెక్కలు చెప్పడం ఎవరి తరం కాదన్నారు. రైతు దీక్షలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపి నామనాగేశ్వర్‌రావు, రాష్ట్ర, జిల్లా నాయకులు మల్లయ్యయాదవ్, వంగాల స్వామిగౌడ్, పాల్వాయి రజనికుమారి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు..నల్లగొండలో రైతు దీక్ష సందర్భంగా కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు..
మోత్కుపల్లి, రమణలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు