తెలంగాణ

జూనియర్ కాలేజీల్లో 1133 కొత్త పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: రాష్ట్రంలోని 79 జూనియర్ కాలేజీల్లో 1133 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం నాడు జీవో 170 జారీ చేశారు. 43 ప్రిన్సిపల్ పోస్టులు, 781 జూనియర్ లెక్చరర్ల పోస్టులు, 78 ఫిజికల్ డైరెక్టర్లు, 78 లైబ్రరియన్లు, 77 సీనియర్ అసిస్టెంట్లు, 76 జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు -77, రికార్డు అసిస్టెంట్లు -80, అటెండర్లు, ఇతర కాంటిజన్సీ స్ట్ఫా -387 మందిని మంజూరు చేయాలని బోర్డు అధికారులు కోరడంతో ఉన్నత విద్యాశాఖ ఆ ప్రతిపాదనలను అధ్యయనం చేసి 1133 పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అందులో ప్రిన్సిపాల్ పోస్టులు 43, జూనియర్ లెక్చరర్లు -781, ఫిజికల్ డైరెక్టర్లు -78, లైబ్రరియన్లు -78, సీనియర్ అసిస్టెంట్లు-77, జూనియర్ అసిస్టెంట్లు-76 ఉన్నాయి. కొత్తగా పోస్టుల మంజూరుపై ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూధనరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.