తెలంగాణ

నగరాలు, పట్టణాల్లో ఆస్తులకు ప్రత్యేక కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: వచ్చే ఏప్రిల్ నుంచి హైదరాబాద్, హెచ్‌ఎండిఏతో సహా రాష్ట్రంలోని నగర ప్రాంతాల్లో ఆస్తులకు సంబంధించి పాస్ బుక్‌లు లేదా ప్రత్యేక కార్డులను ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రత్యేకంగా పాస్ పుస్తకాలు లేదా కార్డులను ఇవ్వనున్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత మూడు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అర్బన్ ప్రోపర్టీ ఓనర్‌షిప్ రికార్డ్స్ కార్యక్రమాన్ని పొరుగున ఉన్న కర్నాటక ప్రభుత్వం అమలు చేసింది. ప్రస్తుతం గ్రామ ప్రాంతాల్లో చేపట్టిన భూమి సర్వే కార్యక్రమం వచ్చే నెల డిసెంబర్ 31వ తేదీతో పూర్తవుతుంది. పట్టణప్రాంతాల్లో సర్వే వల్ల అనేక వివాదాలు పరిష్కారం లభించనుంది.గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ, హెచ్‌ఎండిఏ పరిధిలో దాదాపు ఐదు వేల మందిని సర్వే నిమిత్తం వారి సేవలను వినియోగించుకోనున్నారు. గ్రామ ప్రాంతాల్లో ప దివేల మంది రెవెన్యూ సిబ్బంది 3600 బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహిస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో భూముల విలువ ఎక్కువ. హెచ్‌ఎండిఏ ఆరు జిల్లాలకు విస్తరించి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్, శంషాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్ జిల్లాలు హెచ్‌ఎండిఏ పరిధిలోకి వస్తాయి. గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో సర్వే పనులు సంక్లిష్టతతో కూడుకుని ఉంటుందని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో వ్యవసాయ పనులు జరుగుతుంటాయి. అక్కడ వివాదాల తీరు వేరుగా ఉంటుంది. పట్టణాలు, శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. ప్రభుత్వ,అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు జోరుగా గతంలో జరిగాయి. ఇవి ఏ రకం భూములో తెలియక చాలా మంది కొనుగోలు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ నిర్వహించనున్న సర్వే వల్ల అసైన్డ్భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నగర శివార్లలో అనేక భూములను పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామిక వేత్తలకు కూడా కేటాయించారు. వీటి కోసం ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్నాటక ప్రభుత్వం నగర ప్రాంతాల్లో భూముల వివాదాలను పరిష్కరించేందుకు చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఆస్తి యాజమాని పేరు, మ్యుటేషన్ జరిగిన తేదీ, రిజిస్టర్ నంబర్, ఆస్తి ఉన్న ప్రాంతం, సరిహద్దులు, ఇందులో ఎవరి వాటా ఎంత అనే వివరాలను రెవెన్యూ సిబ్బంది సేకరిస్తారు. పట్టణప్రాంతాల్లో ఇండ్లు కట్టిన వెంటనే ఆస్తి పన్ను, కరెంటు బిల్లు, నల్లా బిల్లు చెల్లించి యాజమానులు తమ ఆధీనంలో ఉన్నట్లు రికార్డులు నమోదు చేస్తారు. కాని సబ్ రిజిస్ట్రర్ ఆఫీసులోని రికార్డుల్లో ఈ భూమి వీరి పేరు మీద ఉండదు. ప్రభుత్వం చేపట్టనున్న సర్వే వల్ల డబుల్ రిజిస్ట్రేషన్లను కూడా నిరోధించవచ్చునని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి.