తెలంగాణ

మాతా శిశు వైద్యశాలలు మరిన్ని ఏర్పాటు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ప్రభుత్వ వైద్యశాలల్లో పెరుగుతున్న ప్రసూతిలకు అనుగుణంగా మరిన్ని మాతాశిశు వైద్యశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. ‘కెసిఆర్ కిట్ల పథకం’ విజయవంతమైందన్నారు. మంగళవారం మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పలువురు అధికారులతో ఈ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కెసిఆర్ కిట్ల పథకం అమలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతిల సంఖ్య పెరిగిందన్నారు. 50 శాతానికి మించి ప్రసూతిలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 5,08,336 మంది గర్బిణీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. 1,06,213 కెసిఆర్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ దశలో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నందున, కొత్తగా ఏడు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. జిల్లా ఆసుపత్రులకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వివరించారు.