తెలంగాణ

విగ్రహమే ఖరారు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: సచివాలయం సమీపంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకోల్పాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అంబేద్కర్ విగ్రహ కమిటీ తుది రూపాన్ని ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుది ప్రతిపాదనలను ఖరారు చేశారు. ఈ ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బుధవారం నాడు కలిసి నిర్ణయం తీసుకుంటారు. దేశవిదేశాలు తిరిగిన కమిటీ ఢిల్లీకి చెందిన డిజైన్స్ అసోసియేట్స్ రూపొందించిన నమూనాలను పరిశీలించిన మీదట విగ్రహం నెలకోల్పనున్న ప్రాంతంలో నిర్మించతలపెట్టిన భవన సముదాయానికి పార్కుకు ఆమోదం తెలిపింది. అయితే అదే సమయంలో అక్కడ ఎటువంటి ప్రతిమ పెట్టాలనే అంశంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రికి వదిలిపెట్టాలని కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ ప్రాంగణంలో ఉన్న విగ్రహ నమూనాతో పాటు రాష్టర్రాజధాని ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాన్ని జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్సు కాలేజీకి చెందిన శిల్పి బోళ్ల శ్రీనివాసరెడ్డి రూపొందించిన మూడు విగ్రహాల ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరిస్తారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయని నర్సింహారెడ్డి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, బుద్ధవనం అభివృద్ధి చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్‌మిశ్ర, గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కరుణాకర్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ నిపుణుడు గణపతిరెడ్డి, ఫైన్ ఆర్ట్సు కాలేజీ విసి ప్రొఫెసర్ కవిత, శిల్పి బోళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.