తెలంగాణ

మీకోసమే మేం రోడ్డెక్కాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 21: ఉపాధి కల్పించాలని రోడ్డెక్కుతున్న నిరుద్యోగులు, అరకొర వేతనాలతో దుర్భరమైన జీవితాలను గడుపుతున్న ఒప్పంద ఉద్యోగులకు తగిన న్యా యం కల్పించడానికే టీజేఏసీ కొలువుల కొట్లాట పేరిట రోడ్డెక్కామని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సెర్ప్ ఉద్యోగులు చేస్తు న్న నిరవధిక సమ్మె, రిలే నిరహార దీక్షలు 23వ రోజుకు చేరుకోగా సం గారెడ్డి పర్యటనకు వచ్చిన కోదండరాం సెర్ప్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒప్పంద కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని అధికార పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చి ఉద్యోగులకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. ఎన్నికల మేని ఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పంజాబ్ రాష్ట్రంలో సమాన పనికి సమాన వేతనం అమలు అవుతున్న విషయా న్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. పూర్వం రాజుల కాలంలో కూడా ధర్నా చేసుకునేందు కు వేదికలు ఉండేవని, దండోరా వేస్తే అక్కడికి ప్రజలు వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను రాజు లు కల్పించారని, కేసీఆర్ మాత్రం ప్రజాస్వేచ్ఛకు భంగం కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలను భాగస్వాముల ను చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని కోదండరాం గుర్తు చేసా రు. ఆయన పిలుపుమేరకు మహిళలు ఉద్యమంలో పాల్గొనేందుకు సెర్ప్ ఉద్యోగులు శ్రమించారన్నారు.