తెలంగాణ

బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఖబిల్లు పెట్టాలని జనవరిలో సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: బిసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జనవరి 7న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిసి భవన్‌లో బుధవారం బిసీ ఉద్యోగుల రాష్టస్థ్రాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇతర సామాజిక వర్గాల ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించి బిసీ ఉద్యోగులను మాత్రం విస్మరించారన్నారు. పార్లమెంట్‌లో బిసీ బిల్లు ప్రవేశపెట్టాలని జాజుల డిమాండ్ చేసారు. కేంద్రంపై వత్తిడి తీసుకరావడానికి హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు జాజుల పేర్కొన్నారు.

పత్తి పంట తరహాలో రాష్ట్రానికి గులాబీ రంగు చీడ పట్టుకుంది
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్, నవంబర్ 22: పత్తి తదితర పంటలకు చీడ పట్టుకున్నట్లే రాష్ట్రానికి గులాబీ రంగు చీడ పట్టుకున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ చీడను 2019 ఎన్నికల్లో తొలగించాలని జీవన్‌రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల నష్టం నివేదికను కేంద్రానికి పంపించకపోవడంతో సహాయం అందడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్వాకంతో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందడం లేదని, పంటల బీమాను పొందడం లేదని ఆయన చెప్పారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నదని ఆయన తెలిపారు.

కొలువుల కొట్లాట సభపై హైకోర్టులో నేడు విచారణ

హైదరాబాద్, నవంబర్ 22: కొలువుల కొట్లాట సభను సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించుకోవడానికి పోలీసులు నిరాకరించడంపై గురువారం (23న) హైకోర్టులో విచారణ జరగనున్నది. కొలువుల కొట్లాట పేరిట టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సభ నిర్వహించాలనుకోగా, పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే. అయితే నగర శివారులో నిర్వహించుకోవడానికి కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. కాగా ఎల్‌బి నగర్ డిసిపి సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకోవడానికి అనుమతి నిరాకరించారంటూ బుధవారం కోర్టులో టి.జెఎసి తరఫున అడ్వకేట్ రచనా రెడ్డి తెలిపారు. దీనిపై గురువారం విచారణ కొనసాగిస్తామని న్యాయమూర్తి తెలిపారు.