తెలంగాణ

ఉగ్రవాదులతో సంబంధం ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: విద్య, వసతి, ఆహారం సమకూరుస్తామంటూ ఆదరణ ముసుగులో గ్రామీణ ప్రాంతాల్లోని పేదల పిల్లలను అనాధ ఆశ్రమాల్లో చేర్చుకుని వారిని ఇస్లాం మతంలోకి మార్పిడి చేస్తున్న ముఠాల మూలాలపై కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు దృష్టిసారించాయి. ఈ రాకెట్ వెనుక రాష్ట్రం, దేశం వెలుపల ఉన్న సంబంధాలపై నిశిత పరిశీలన ఇరుపుతున్నాయి. తాజాగా రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన ముఠా సభ్యుల కార్యకలాపాలను తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ ముఠా కార్యకలాపాలతో టెర్రర్ లింకులు ఉన్నదీ లేనిదీ కూడా నిర్థారించుకుంటున్నారు. ముఠా వెనుక రాడికల్స్ పాత్ర ఏదైనా ఉందా లేదా అనే కోణంలోనూ విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రాడిక్స్ లింకులపై నిర్ధారణ కాలేదని, అయినప్పటికీ వీరిపాత్రను కొట్టిపారేయలేమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితల కస్టడీ పిటీషన్ ఇప్పటికే విచారణ అధికారులు దాఖలు చేశారు. కోర్టు అనుమతి రాగానే నిందితులను విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడతాయని భావిస్తున్నారు.
రాచకొండ పోలీసులు వౌలాలిలోని ఒక పీస్ ఆర్ఫన్ హోమ్ సొసైటీపై దాడి చేసి అక్కడ ఉన్న 17 మందిని కాపాడిన సంగతి తెలిసిందే. ఆ పిల్లలకు అరబిక్, ఉర్ధూ భాషలను నేర్పించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ఇందుకు అవసరమైన ప్రింటెడ్ మెటీరియల్‌ను బాలలకు పంపిణీ చేసినట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గతంలో సత్యనారాయణ అనే ఇంటర్ విద్యార్థి మహ్మద్ సిద్ధిఖీగా పేరు మార్చుకుని ఇస్లాం మత ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇతన్ని ఇటీవలే అరెస్టు చేశారు.
అరెస్టు కాకముందు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లలను సేకరించి వారిని హైదరాబాద్ ఆర్ఫన్ హోమ్‌కి చేర్చే వాడని వెల్లడైంది. ఇతనికి పాస్‌పోర్టు లేకపోవడంతో విదేశాలకు ఇంకా వెళ్లలేదని, కేవలం రాష్ట్రానికే పరిమితమైనట్లు అప్పట్లో గుర్తించారు. ఈ తరహాలో ఇంకా ఎంత ఇతర నెట్‌వర్క్ పని చేస్తుందనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. ఇస్లాం మతంలోకి బాలలను మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలను ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేశాయి. ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడ జరిగినా హైదరాబాద్‌లోనే దాని మూలాలు ఉండడం వల్ల నిఘా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. తాజాగా పిల్లలను ఆదరించి వారిని మత మార్పిడి చేయడం ద్వారా భవిష్యత్‌లో వాళ్లను ఏవిధంగా తీర్చిదిద్దుతారనే అంశం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా పిల్లల మతమార్పిడి, బలవంతంగా ఇస్లాం మత పాఠాలు చెప్పడం, అరబ్బీ, ఉర్దూ భాషను నేర్పించడం వెనుక వారి తల్లిదండ్రుల స్వచ్ఛంద అంగీకారం ఉందనేది కూడా ప్రచారం జరుగుతోంది. కొందరు తమ పిల్లలను తమ అంగీకారం మేరకే పంపిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఇంత వరకు పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. నిందితులను కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు.