తెలంగాణ

అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణపై స్టేటస్ కో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ ప్రక్రియపై తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు యధాతధ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. మంజూరు చేసిన ప్లాన్‌కు విరుద్దంగా నూటికి నూరు శాతం ఉల్లంఘనలు ఉంటే అటువంటి వాటిని క్రమబద్దీకరించ వద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి.బోసేల్, జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాల క్రమబద్దీకరణపై సవాల్ చేస్తూ ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నిర్మాణంలో 20 శాతం లోపాలు ఉంటే దానిని మాత్రమే క్రమబద్దీకరించవచ్చని, మొత్తం అక్రమ కట్టడాన్ని కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ చట్టం తీసుకు వచ్చిందని, ఈ దశలో పిటీషన్ దాఖలుకు అవకాశం లేదని తెలిపారు. పిటీషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ అడ్వకేట్ జనరల్ వాదనపై స్పందిస్తూ ఆ చట్టంపై సవాల్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఇప్పటికే అక్రమ కట్టడాల క్రమబద్దీకరణపై మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నందున ఈ పిటీషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు యధాతధ స్థితిని కొనసాగించాలని కోరారు. అనంతరం ఈ కేసును వేసవి సెలవుల అనంతరం విచారణ చేపట్టేందుకు వాయిదా వేస్తున్నట్లు బెంచ్ వెల్లడించింది.