తెలంగాణ

హుస్సేన్‌సాగర్ శుద్ధికి తీసుకున్న చర్యలేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: హుస్సేన్ సాగర్‌లో కాలుష్యనివారణకు కఠిన చర్యలు తప్పవని హైకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది.గణేష్ నిమజ్జనం సందర్భంగా మరింత కాలుష్యం ఏర్పడకుండా ప్రత్యేక ఆవరణల నిర్మాణం అనివార్యమని పేర్కొంది. అలాగే పరిసరాల్లోని చెరువులను కూడా పరిరక్షించాలని హైకోర్టు పేర్కొంది. ప్రత్యేక ఆవరణల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో జరగుకుండా సంబంధిత అధికారులను ఆదేశించాలని పేర్కొంటూ దాఖలైన పిటీషన్‌ను తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్ రావులు సోమవారం నాడు విచారించారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ మధ్య సమన్వయంతో ఉత్సవాల సందర్భంగా గణేష్ విగ్రహాలు మరీ ఎత్తయినవి లేకుండా చూడాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. హుస్సేన్‌సాగర్‌ను నిమజ్జనం తర్వాత దానిని శుద్ధి చేసే పని జిహెచ్‌ఎంసి ఎందుకు చేపట్టడం లేదని న్యాయమూర్తులు జిహెచ్‌ఎంసి న్యాయవాదిని ప్రశ్నించారు. దీనికి అడ్డంకి ఏమిటో చెప్పాలని న్యాయమూర్తులు అన్నారు. హుస్సేన్‌సాగర్ హెచ్‌ఎండిఎ పరిధిలోకి వస్తుందని న్యాయవాది పేర్కొనగా, పరస్పరం ఒకరిని ఒకరు నిందించుకోవద్దని, శుద్ధి కార్యక్రమం వెంటనే చేపట్టాలని న్యాయమూర్తులు ఆదేశించారు. హుస్సేన్‌సాగర్ నుండి వస్తున్న దుర్వాసన భరించలేకపోతున్నామని అన్నారు. బెంగలూరులో చెరువుల చుట్టూ ప్రత్యేక ఆవరణలు నిర్మించారని అలా చేయడం వల్ల కాలుష్యం నివారించవచ్చని పేర్కొన్నారు. ముంబైలో గణేష్ విగ్రహాల ఎత్తుపై నిషేధం ఉందని రంగులు ఉపయోగించకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను విగ్రహాల తయారీకి వినియోగించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికతో ఈ నెల 28న న్యాయస్థానం ముందుకు రావాలని న్యాయమూర్తులు ఆదేశించారు.