తెలంగాణ

ప్లీనరీకి ఎండ బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: అధికార టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీకి ఎండల భయం పట్టుకుంది. తెలంగాణలో వడగాల్పుల తీవ్రత మరో రెండు, మూడు రోజులపాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న క్రమంలో ప్లీనరీని ప్రతినిధుల వరకే పరిమితం చేయాలని టిఆర్‌ఎస్ భావిస్తుంది. ప్లీనరీకి వచ్చే సందర్భంలో వడదెబ్బ బారిన పడకుండా సాధ్యమైనంత వరకు జనాన్ని నియంత్రించాలని పార్టీ భావిస్తుంది. ప్లీనరీ సందర్భంగా నిర్వహించే కీలక ప్రతినిధుల సభకు గతంలో ఎలాంటి ఆంక్షలు ఉండేవి కాదు. అయితే ఈసారి మాత్రం ప్రతినిధుల సభను నాలుగు వేల మంది ప్రతినిధులకు మాత్రమే పరిమితం చేస్తూ గుర్తింపు కార్డులను జారీ చేసింది. గుర్తింపు కార్డులు కలిగిన ఉన్నవారిని తప్ప ఇతరులను ఎట్టిపరిస్థితుల్లో ప్లీనరీలోకి అనుమతించేది లేదని పార్టీ ముఖ్య నేతలు మంత్రులు కెటిఆర్, ఈటెల రాజేందర్, జగదీశ్‌రెడ్డి పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ నెల 27న జరుగనున్న ప్లీనరీని రెండు సెషన్స్‌లుగా నిర్వహిస్తుండగా, ఉదయం జరిగే సెషన్స్‌కు పార్టీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్, మేయర్లు, మున్సిపల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్ అధ్యక్షులను మాత్రమే అనుమతించే విధంగా గుర్తింపు కార్డులు జారీ చేసింది. ప్రతినిధుల సభకు పరిమిత సంఖ్యలోనే అనుమతించడమే కాకుండా ఆ సాయంత్రం జరిగే బహిరంగ సభకు కూడా జిల్లాల నుంచి జనం కూడా పరిమిత సంఖ్యలోనే హాజరుకావాల్సిందిగా మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రతినిధుల సభకు మాత్రమే పది జిల్లాల నుంచి వస్తారని, బహిరంగ సభకు ఖమ్మం జిల్లాకు సమీపంలో ఉండే ప్రాంతాల వారు వస్తే సరిపోతుందని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా ప్లీనరీని అట్టహాసంగా కాకుండా సాదాసీదాగా నిర్వహించాల్సిందిగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినట్టు మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. ఇలా ఉండగా ప్లీనరీలో ముఖ్యమంత్రి చేయబోయే ప్రసంగం కూడా క్లుప్తంగా ఉంటుందని, ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న కొత్త రాష్ట్రం కోసం ప్రజల కలలు, ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ఫలాలు సాకారం కావాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వనున్నారని పార్టీ వర్గాల సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్ ఈ మూడింటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్లీనరీలో ప్రతిజ్ఞ చేయనున్నట్టు తెలిసింది. ప్లీనరీలో ముఖ్యంగా 15 తీర్మానాలు ఉంటాయని, ఇందులో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలతో పాటు తాజా రాజకీయాలపై తీర్మానాలు ఉంటాయని పార్టీ నేతలు తెలిపారు.