తెలంగాణ

ఐదుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ (బెజ్జూరు), డిసెంబర్ 20: బోనాల పండుగకు ఇంటినుంచి బయలుదేరినవారు గంటలోపే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం సుల్గుపెల్లి, లోడ్‌పెల్లి అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో దహెగాం, బెజ్జూరు మండల వాసులు ఉన్నారు.
ఆదివారం ఉదయం బోనాల పండుగకు బెజ్జూరు మండలం జైహింద్‌పూర్ నుంచి దహెగాం మండలం కొంచెవెల్లి గ్రామానికి ఆటోలో బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు, అక్కాచెల్లెళ్లు లోడ్‌పెల్లి అటవీ ప్రాంతంలో ప్రమాదంలో మృతిచెందారు. మృతుల్లో మండలంలోని జైహింద్‌పూర్ గ్రామానికి చెందిన సిడాం సుగుణ (35), సిడాం లావణ్య (16), గోబె పుష్ప (35), దహెగాం మండలంలోని కొంచెవెల్లి గ్రామానికి చెందిన చౌదరి రాజ్యలక్ష్మి (16), చౌదరి పార్వతి (12)లు అక్కడికక్కడే మృతిచెందగా, ఆటో డ్రైవర్ సాయి గాయాలతో బయటపడ్డాడు. అతివేగంతో వెళ్తున్న మరో ఆటోను ఓవర్‌టేక్ చేసే సమయంలో ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టగా ప్రమాదం సంభవించింది. మృతుల్లో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. మృతిచెందిన చౌదరి రాజ్యలక్ష్మి, చౌదరి పార్వతి, సిడాం లావణ్య అనే విద్యార్థులు కౌటాల మండలం బాబాపూర్ ఆశ్రమ పాఠశాల్లో చదువుతున్నారు. సంఘటనా స్థలాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, కౌటాల సిఐ అచ్చేశ్వర్ రావు, బెజ్జూరు ఎస్సై రాజులు, తహసిల్దార్ సూర్యనారాయణ సందర్శించి సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కౌటాల సిఐ అచ్చేశ్వర్‌రావు, ఎస్సై రాజు తెలిపారు.

చిత్రం.. ప్రమాదస్థలంలో ఆటోనుంచి
మృతదేహాలను బయటికి తీస్తున్న దృశ్యం