తెలంగాణ

ప్రాజెక్టులపై పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌కు చేరుకున్న కేసీఆర్ కాళేశ్వరం, మిడ్ మానేర్ పనులపై సమీక్షలు
ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం
కరీంనగర్, డిసెంబర్ 6: రాష్ట్రాన్ని కోటి ఏకరాల మాగాణిగా మార్చాలన్న సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజె క్టు పనులతోపాటు మిడ్‌మానేరు పనుల పరిశీలనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండ్రోజుల సుడిగాలి పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరిన కేసీఆర్ నగర శివారులో తీగులగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగారు. హెలీక్యాప్టర్ నుంచి దిగిన కేసీఆర్‌కు మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉన్నారు. రాత్రి ఇక్కడే కేసీఆర్ బస చేస్తారు. గురువారం ఉదయం 9 గంటలకు తీగలగుట్టపల్లి నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరి ఉదయం 9.50 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా తుపాలగూడెం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. 10.20కి
బ్యారేజీ పనులను పరిశీలిస్తారు. 10.40కి మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని 11గంటల వరకు పరిశీలిస్తారు. 11.15కు కనె్నపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలిస్తారు. 12 గంటలకు పెద్దపల్లి జిల్లా అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకుని 12.20 గంటల వరకు పరిశీలిస్తారు. 12.40కి సిరిపురం పంప్‌హౌస్ వద్ద భోజనం చేస్తారు. అనంతరం 1.30కి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 2 గంటలకు సుందిళ్ల బ్యారేజీకి చేరుకుని 2.20 గంటల వరకు పనులను పరిశీలిస్తారు. 2.45 గంటలకు గోలివాడ పంప్‌హౌస్‌కు చేరుకుని 3.30 వరకు పంప్‌హౌస్ పనులను పరిశీలిస్తారు. అనంతరం 4.15 గంటలకు రామగుండంలోని ఎన్టీపీసీకి చేరుకుని, ఆ రాత్రి ఇక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రామగుండం నుంచి బయలుదేరి 9.20కి ధర్మారం మండలం నందిమేడారం పంప్‌హౌస్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ 12 గంటల వరకు పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం 12.20కి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని పంప్‌హౌస్ వద్ద భోజనం చేస్తారు. అనంతరం అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తారు. 2.45కు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌లోని పంప్‌హౌస్ పనుల వద్దకు చేరుకుని 3.15 గంటల వరకు పరిశీలిస్తారు. ఇక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేర్‌కు 3.40కి చేరుకుని అక్కడి పనులను పరిశీలిస్తారు. అనంతరం 4.30కు తిరిగి హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. ఇలా రెండ్రోజుల పాటు ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ హెలీక్యాప్టర్‌లో సుడిగాలి పర్యటన చేయనున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం పర్యటించే ప్రాంతాల్లో బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.