తెలంగాణ

2018 నాటికి ఇంటింటికీ ఇంటర్నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఇంటింటికి ఇంటర్నెట్ అందించడానికి లక్ష్యంగా పెట్టుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం పురోగతిలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖ చేపట్టిన ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి చర్చించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని మంత్రి అన్నారు. ఈ మార్పులను ప్రపంచానికి చూపేందుకు మహేశ్వరం మండలంలోని నాలుకు గ్రామాల్లో చేపడుతున్న టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్ వర్క్ జనవరి మొదటి వారానికల్లా పూర్తి కాబోతుందని అధికారులు వివరించారు. ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలను ఈ నెట్ వర్క్ తెలియజేయనుందన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో 10 ప్రముఖ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయని మంత్రి కెటిఆర్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ కింద అందిస్తున్న ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు విడుదల చేయాలని అధికారులు మంత్రి దృష్టికి తీసుకవచ్చారు. హైదరాబాద్ ఫార్మాసిటీ భూ సేకరణ-అనుమతుల ప్రక్రియను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో పర్యావరణ అనుమతులు రానున్నాయని అధికారులు వివరించారు. టిఎస్‌ఐఐసి చేపట్టిన పలు ఇతర ప్రాజెక్టులు, పార్కుల నిర్మాణ పురోగతిని అధికారులు వివరించారు. టిహబ్-2, ఇమేజ్ టవర్, టి-వర్క్స్ ప్రాజెక్టుల పురోగతిని మంత్రి సమీక్షించారు.
టివర్క్స్ భవన నిర్మాణానికి డిజైన్ సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది మే కల్లా ఇది పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు పరిశ్రమలశాఖ, ఐటీశాఖ అధికారులు పాల్గొన్నారు.