హైదరాబాద్

న్యాయవాదుల కేసు ఫిబ్రవరి 6కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కడపల్లి, డిసెంబర్ 6: ప్రత్యేక హైకోర్టుకై పోరాడుతూ అరెస్ట్ అయిన న్యాయవాదుల కేసు ఫిబ్రవరి 6కు వాయిదా వేశారని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కో కన్వీనర్ పులిగారి గోవర్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలని ప్రభుత్వాలకు ఎన్ని విన్నపాలు చేసినా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల మనోభీష్టాలను గౌరవించాలని ఉమ్మడి హైకోర్టు ముందు 2015 మార్చిలో ప్రజాస్వామ్యబధ్ధంగా నిరసన తెలియచేస్తూ ఉండగా చార్మినార్ పోలీసులు తెలంగాణ న్యాయవాదులపై వివిధ సెక్షన్ ల ప్రకారం 37 మందిపై కేసులు నమోదు చేశారని వివరించారు. బుధవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు మెట్రో పాలిటిన్ జడ్జి ముందు తెలంగాణ న్యాయవాదులు హాజరయ్యారని, కేసును తదుపరి విచారణకై ఫిబ్రవరి 6 కు వాయిదా వేశారని తెలిపారు.

ఎంబీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - మంత్రి జోగు రామన్న
ఖైరతాబాద్, డిసెంబర్ 6: అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఎంబీసీ సంచార జాతుల అభివృద్ధి - సంక్షేమంపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమితి ప్రధాన కార్యదర్శి బెక్కం వెంకట్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య, ప్రొఫెసర్ తిరుమలి, మురళీ మనోహర్, సమితి అధ్యక్షులు బాలరాజు తదితరులు హాజరై మాట్లాడారు. స్వాతంత్య్ర భారతదేశంలో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని మంత్రి అన్నారు. బీసీల్లో మరింత వెనుకబాటును అనుభవిస్తున్న కులాలను వెలుగులోనికి తీసుకువచ్చి వారిని కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని మంత్రి జోగి రామన్న తెలియజేశారు.

షీ-టీంల పనితీరును మెరుగుపర్చాలి
వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ ఆదేశం
వికారాబాద్, డిసెంబర్ 6: జిల్లాలో షీ-టీం పనితీరును మరింతగా మెరుగుపర్చాలని ఎస్పీ టీ.అన్నపూర్ణ సూచించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో షీటీమ్‌ల పనితీరు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మహిళ, పాఠశాల, కలాశాల విద్యార్థిని, విద్యార్థులు మా రక్షణ కొరకే ప్రత్యేకంగా జిల్లాలో షీ-టీంలు పనిచేస్తున్నాయని నమ్మే వరకు ప్రతి పాఠశాల, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లోని వార్డు మెంబర్లు, డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ టీచర్లతో షీ-టీం అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. వారికి షీ-టీం పనితీరు, ప్రయోజనాలు, బాల్య వివాహాల నివారణ అంశాలను వివరించి, అత్యవసరమైన సమయాల్లో షీ-టీం సహాయం లేక పోలీసు సహాయం పొంది సమస్యలను పరిష్కరించుకునేలా తెలియజేయాలన్నారు.

స్కీంలకు యువతను
ఎంపిక చేసే ఏజెన్సీలకు శిక్షణ
* కార్యచరణ రూపకల్పనపై కలెక్టర్ యోగిత ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం కింద అమలు చేస్తున్న వివిధ రకాల స్కీంలకు యువతను లబ్దిదారులుగా ఎంపిక చేసే ఏజెన్సీల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ యోగితారాణా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె ఇన్‌చార్జి ఎస్టేట్ ఆఫీసర్ నిఖిల, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ భాస్కరచారి, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ సిబ్బంది, సెట్విన్, ఈసీఐఎల్ యజమాన్యాలతో కలిసి కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం కార్యచరణ రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరుపేద కుటుంబాలకు చెందిన యువతకు ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పించినట్లయితే వారి భవిష్యత్తును బాగుచేయటమే గాక, సమాజానికి బాధ్యత గల పౌరులను అందించగలమని వివరించారు. బస్తీల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదువుకుని నిరుద్యోగులైన మైనార్టీ యువతను ఎంపిక చేయటం కోసం ప్రాజెక్టును అమలు చేసే ఏజెన్సీ, మెప్మా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ యోగితా రాణా చెప్పారు.

అప్పుల బాధతో
రైతు ఆత్మహత్య
పరిగి, డిసెంబర్ 6: అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చన్‌గోమూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి కలాన్ గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ అంజనేయులు వివరాల మేరకు.. పూడూరు మండలం మేడిపల్లి కలాన్ గ్రామానికి చెందిని చిడిగిద్ద నర్సింలు (42)కు గత రెండు సంవత్సరాలుగ వేసిన పంటలు పెట్టుబడి రాలేదు. అప్పులు ఇచ్చిన వాళ్లు తరచు వత్తిడి చేస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. మృతుడికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతరు పెళ్ళి అయింది. ఇద్దరు కూతుళ్ళు చదువుచున్నారు. మృతుడి భార్య పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న్ట్లు ఎస్‌ఐ అంజనేయులు తెలిపారు.

అభివృద్ధిలో హైదరాబాద్ ఫస్ట్
ఒడిశా రాష్ట్ర కౌన్సిలర్లతో మేయర్ బొంతు రామ్మోహన్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 6: అభివృద్ధి, వౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ నగరం దేశంలోనే అన్ని నగరాల కన్నా ముందంజలో ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. అంతేగాక, నగరంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలోని ఏ నగరంలో జరగటం లేదని కూడా ఆయన వాఖ్యానించారు. ఒరిస్సా రాష్ట్రంలోని కటక్, బారిపడ, బాలాసోర్, భద్రక్ తదితర మున్సిపాల్టీల కౌన్సిలర్లు జీహెచ్‌ఎంసీని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌లు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ నగరంలో వౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, పౌరసేవల మెరుగు, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధిస్తోందని, దీనికి నిదర్శనం 2017లో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానం నిలవటమేనని వ్యాఖ్యానించారు. 400 సంవత్సరాల పైగా పురాతన నగరమైన హైదరాబాద్ నగరంలో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక స్థలాలున్నాయని వివరించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ దేశంలోని మరే నగరంలో లేని విధంగా హైదరాబాద్ న గరాన్ని స్లమ్‌లెస్ సిటీగా తీర్చిదిద్దటానికి లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వివరించారు. పేదలకు ఉచితంగా నిర్మించి ఇచ్చే ఒక్కో డబుల్ బెడ్ రూం ఇళ్లు బహిరంగ మార్కెట్‌లో సుమారు 30లక్షల వరకు విలువ చేస్తోందన్నారు. దాదాపు 20వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు కింద ఫ్లై ఓవర్లు, కారిడార్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలో జీహెచ్‌ఎంసీ ఇతర నగరాలకు ఆదర్శంగా మారిందన్నారు. నిరుపేదల ఆకలి తీర్చేటానికి కేవలం ఐదు రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. తడి,పొడి చెత్త వేర్వేరు చేయటానికి ఇంటింటికి రెండు డస్ట్‌బిన్లను చొప్పున 44లక్షల బిన్లను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. దీంతో పాటు 2వేల స్వచ్ఛ ఆటోలను నిరుద్యోగులకు అందించామని వివరించారు. జీహెచ్‌ఎంసీలోని పారిశుద్ద్య కార్మికులకు అందిస్తున్న వేతనాలు దేశంలోనే అత్యధికమని గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయటానికి దేశంలోని పలు కార్పొరేషన్ల ప్రజాప్రతినిధులు, అధికారులు జీహెచ్‌ఎంసీని సందర్శిస్తున్నారని డిప్యూటీ మేయర్ వివరించారు.

ఫీ‘జులుం’పై గరంగరం

సీబీఐటీలో విద్యార్థి సంఘాల ఆందోళన

నార్సింగి, డిసెంబర్ 6: పెంచిన ఫీజులను తగ్గించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని గండిపేటలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి పలు విద్యార్థుల సంఘాల నాయకలు హెచ్చరించారు. లక్ష 13వేల 500ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు, పది రోజుల్లో రెండు లక్షల రూపాయల ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో సీబీఐటీ కాలేజ్ యాజమాన్యం హుకుం జారీచేసింది. గత ఏడాది ఫీజులు కూడా చెల్లించాలని ఆదేశించడంతో విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బుధవారం ఉదయం గేటు వద్ద ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనికి తోడుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఆందోళనతో రోడ్డుపై ఎక్కడిక్కడే వాహనాలు నిలిచిపోయాయి. నార్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను బుజ్జగించి, రోడ్డుపై కాకుండా కాలేజ్ ఆవరణలో ఆందోళన చేసుకోవాలని సూచించారు. ఫీజులను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు కోర్టు అనుమతితో ఫీజులు పెంచామని, గతేడాది విద్యార్థులు చేరినపుడే ఫీజులు పెరుగుతాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పామని సీబీఐటీ కాలేజ్ ప్రిన్సిపాల్ పీ.రవీందర్ తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ప్రిన్సిపాల్ చర్చించారు. ఈనెల 9న యాజమాన్యంతో నగరంలోని కార్యాలయంలో చర్చించేందుకు రావాలని సూచిస్తూ అప్పటి వరకు ఆందోళన విరమించాలని విద్యార్థులను కోరారు. యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.

నేడు జీహెచ్‌ఎంసీ
కౌన్సిల్ సమావేశం
శ 279 ఏరియా సభ ప్రతినిధుల నియామకం
శ వార్డు కమిటీల్లో మహిళా సభ్యుల నియామకంపై చర్చ
శ పలు ‘స్థారుూ’ తీర్మానాలకు ఆమోదానికి అవకాశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 6: మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలక మండలి సర్వసభ్య సమావేశం గురువారం జరగనుంది. ఉదయం పది గంటలకు మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ప్రారంభం కానున్న ఈ ఆరో సర్వసభ్య సమావేశంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాలుగు డివిజన్లలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 114 మంది సభ్యుల నామినేషన్, వార్డు కమిటీల్లో మహిళా సభుల నియామకం, అలాగే ఏరియా సభకు ఇంకా నియమించాల్సి ఉన్న 276 మంది సభ్యుల నియామకం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. అప్పట్లో నాలుగు వార్డులకు చెందిన 114 మంది సభ్యుల నియామకంపై స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదరక వాయిదా పడిన సంగతి తెలిసిందే! దీంతో పాటు ఇప్పటి పలు దఫాలుగా జరిగిన స్థారుూ సంఘం ఆమోదించిన తీర్మానాలను సైతం ఈ సభలో ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపే అవకాశముంది. ఇందులో ఎక్కువగా రోడ్ల విస్తరణతో పాటు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యచరణ(ఎస్‌ఆర్‌డీపీ)కి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పనులకు సంబంధించి ఇదివరకే స్థాయి సంఘం చేసిన తీర్మానాలకు కూడా కౌన్సిల్ ఆమోద ముద్ర వేయనుంది. మధ్యాహ్నాం నుంచి వివిధ అంశాలకు సంబంధించి ఇప్పటికే సభ్యులు సమర్పించిన 16 ప్రశ్నలపై చర్చించిన తర్వాత సంబంధిత అధికారులు సమాధానం చెప్పనున్నారు. అంతేగాక, అజెండాలోని పలు అంశాలను మజ్లీస్ సభ్యులు లేవెనెత్తే అవకాశముంది. పాతబస్తీలో పలు పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజాసమస్యలపై, అలాగే కార్పొరేటర్ బడ్జెట్ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశముంది.

అభివృధ్ధిపై చర్చకు రా..

* మంత్రి మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సవాల్

దౌల్తాబాద్, డిసెంబర్ 6: కొడంగల్ నియోజకవర్గ అభివృధ్ధిపై మంత్రి మహేందర్‌రెడ్డి చర్చకు రావాలని ఎమ్యేల్యే రెవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం మండల కేంద్రంలోప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించారు. మంత్రి మహేందర్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన తాండురు అభివృద్ధని మరిచి, కొడంగల్ అభివృధ్ధి చేయడం చేయడం లేదని, తనపై నిందలు మోపడం సరికాదన్నారు. యాలాల మండలం ముద్దపెట గ్రామాన్ని దత్తత తీసుకున్నా మంత్రి అక్కడ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. మంత్రి హోదాలో ఉండి సొంత నియోజకవర్గంను పట్టించుకోని మంత్రి.. కొడంగల్‌పై అవాకులు చెవాకులు మాట్లాడుతావా.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కొడంగల్ అభివృధ్ధిపై నేను సిద్ధంగా ఉన్నా.. దమ్ముంటే.. నువ్వు సిద్ధమేనా? అంటూ మంత్రిపై ఘాటుగా స్పందించారు.

మహిళల జీవనోపాధి కోసమే రుణాలు
షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 6: మహిళల జీవనోపాధి కోసమే సంఘాలకు రుణాలు ఇస్తామని రంగారెడ్డి జిల్లా డీఆర్‌డిఏ ఏపీడీ ఉమారాణి అన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో కేశంపేట, ఫరూఖ్‌నగర్ మండల మహిళా సంఘాల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉమారాణి మాట్లాడుతూ 2017-2018 ఆర్థిక సంవత్సరానికి మహిళా సంఘాల సభ్యులకు జీవనోపాధి కోసం రుణాలు ఇవ్వనున్నట్లు వివరించారు.
బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించేందుకు మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని అన్నారు. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాల సభ్యులు ఏ బ్యాంకు నుండి ఎన్ని రుణాలు తీసుకున్నారని, తిరిగి ఎంతమేరకు రుణాలు చెల్లించారనే విషయాలను మహిళా సంఘాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుల నుండి తీసుకున్న ప్రతి రూపాయికి రికార్డులు తప్పని సరిగా నమోదు చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాని అన్నారు. సమావేశంలో అధికారులు సత్యనారాయణ, వెలుగు ఏపీఎంలు నాగేష్, భగవంతు, జ్యోతి పాల్గొన్నారు.

వర్ధమాన్ కప్ ఫిడే రేటింగ్ ఓపెన్
చెస్ టోర్నీ ప్రారంభం
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 6: వర్ధమాన్ కప్ ఫిడే రెటింగ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజనేరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలతో పాటు జింబాబ్వే, ఆస్ట్రేలియా దేశాల నుండి మొత్తం 150 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. టోర్నమెంట్‌ను వర్ధమాన్ ఇంజనేరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిసత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. తొమ్మిది రౌండ్‌ల పాటు కొనసాగే టోర్నమెంట్ స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ చెస్ సంఘం కార్యదర్శి కెఎస్.ప్రసాద్, టోర్నమెంట్ నిర్వహకుడు ప్రియదర్శన్ బజన్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు రెండు రౌండ్‌లు ముగిశాయి. ఈ పోటీలో టాప్ సీడ్ క్రీడాకారులతో యువ క్రీడాకారులు తలపడుతున్నారు.

లంగ్ క్యాన్సర్‌తోనే అత్యధిక మరణాలు
ఖైరతాబాద్, డిసెంబర్ 6: అంతర్జాతీయంగా క్యాన్సర్ సంబంధిత మరణాల్లో అత్యధిక మరణాలు లంగ్ క్యాన్సర్‌తోనే జరుగుతున్నాయని ప్రముఖ ఆంకాలజిస్ట్ వంశీకృష్ణ తెలిపారు. బుధవారం నగరంలోని గ్రీన్‌పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భయంకరమైన క్యాన్సర్ వ్యాధిపట్ల సరైన అవగాహన లేకపోవడంతో నానాటికి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో పెరుతున్న కాలుష్యం, పోగాకు వినియోగం పెరగడంతో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ భారిన పడి చాలా మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో యువత పోగాకుతోనే క్యాన్సర్‌కు గురి అవుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టార్గెటెడ్ థెరపీ చికిత్సతో లంగ్ క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్టు చెప్పారు. ఈ చికిత్స విధానం ద్వారా రోగులకు ఖచ్చితమైన చికిత్సలు అందడంతో గతంలో కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
షాద్‌నగర్, డిసెంబర్ 6: వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేత ఈశ్వర్ నాయక్ ఆరోపించారు. బుధవారం షాద్‌నగర్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈశ్వర్ నాయక్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల అదుకుంటామని ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తున్నారే తప్పా ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఎంతో కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగుకోసం పెట్టిన పెట్టుబడులు రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆరోపించారు. దళితులు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చినప్పటికీ నేటి వరకు పూర్తిస్థాయిలో ఎక్కడ పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. 8వ తేదిన రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ పట్టణంలో నిర్వహించనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను విజయవంతం చేసేందుకు రైతు కార్మికులు కృషి చేయాలని కోరారు.

ఏడేళ్ల నిరీక్షణ ఫలించింది
తాండూరు, డిసెంబర్ 6: యాలాల మండలం కోకట్ గ్రామ పంచాయతీలో రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణం కోసం 2008 సంవత్సరంలో కేటాయించిన అసైన్డ్ భూముల నిర్వాసితులకు ప్రభుత్వం ఎట్టకేలకు అప్పట్లో ఇచ్చిన హామీని నెరవేర్చింది. బుధవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ స్వగృహా కోసం భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు 92 మందికి లాటరీ పద్ధతిలో ఒక్కొక్కరికి 120 గజాల చొప్పున స్థలాలను కేటాయించారు. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. గతంలో కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన ఇళ్ల స్థలాల కేటాయింపు హామీ వాయిదా పడింది. కాగా భూ నిర్వాసితులు 2010లో తమకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని పాలకులు ఇంతవరకు అమలు చేయలేదంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో వెలువడిన కోర్టు ఉత్తర్వుల ఆదేశానుసారం భూ నిర్వాసితులకు తమ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకు 120 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నట్లు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న లారీ పార్కింగ్ స్థలాన్ని నూతన మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి కేటాయించినందున.. లారీ గూడ్స్ ట్రాన్స్‌పోర్టు యజమానుల కోరిక మేరకు లారీ పార్కింగ్‌కు హైదరాబాద్ రహదారిలో ఉన్న పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామ పరిసరాలలో ఉన్న ఆర్టీఏ వెహికల్ టెస్టింగ్ ట్రాక్ సమీపంలో ఉన్న పనె్నండు ఎకరాల భూమిని లారీ పార్కింగ్ కోసం కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. తాండూరు డివిజన్ హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ విజ్ణప్తి మేరకు దసరా ఉత్సవాలు, హిందూ పండుగలు, జాతరలకు రెండు ఎకరాల భూమిని కేటాయించిన్నట్లు మంత్రి వెల్లడించారు. ముస్లిం మైనారిటీల కోసం మరో రెండు ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ జీ.సంధ్యారాణీ, తాండూరు ఆర్డీవో వేణుమాధవ్ రావు, డివిజన్ డీఏఓ అశోక్ కుమార్, తహశీల్దార్‌లు జీ.రాములు, తులసీరాం పాల్గొన్నారు.

దివ్యాంగుల ముందడుగుకు అవకాశాలు ఇవ్వాలి

వికారాబాద్, డిసెంబర్ 6: దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా, మంచి అవకాశాలిస్తూ మంచిగా చదివించి ముందుకు తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి డాక్టర్ పీ.మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 13885 మంది దివ్యాంగులుండగా 12778 పింఛన్లు పొందుతున్నారని చెప్పారు. క్రీడాపోటీల్లోనూ దివ్యాంగులు సత్తా చాటుతున్నారని, క్రీడాపోటీలతో పాటు చదువులోనూ పైకి రావాలని ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్‌లను రూ.500 నుండి రూ.1500 పెంచగా, సంఘాలుగా ఏర్పాటుచేసి ఆదుకోవడంలో కృషి చేస్తోందని పేర్కొన్నారు. కలెక్టర్ డీ.దివ్య మాట్లాడుతూ ప్రతి మనిషికీ లోపం ఉంటుందని, లోపం కారణంగా శుభకార్యాలకు వెళ్లి బాధపడుతుంటారని, బాధపడుతూ ఎలాంటి కృషి చేయకుండా ఉండకూడదని సూచించారు. కార్యక్రమంలో వికారాబాద్ శాసనసభ్యుడు బీ.సంజీవ రావు, రాష్ట్ర వైద్య వౌలిక సదుపాయాల అభివృద్ధి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, డీఆర్‌డీవో పిడబ్యూ జాన్సన్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ వీరమణి, ఎంపీపీ ఎస్.్భగ్యలక్ష్మి, తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతా సంపత్, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.రాంచంద్రా రెడ్డి, జడ్పీటీసీ ముత్తార్‌షరీఫ్, సీడీపీవో వెంకటలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు బీ.సత్యనారాయణ రెడ్డి, భోగేశ్వర్ రావు, తహశీల్దార్ చినప్పల నాయుడు, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు. దివ్యాంగులకు ధ్రువీకరణపత్రాలు, ట్రైసైకిళ్లు, బస్‌పాస్‌లు అందజేశారు.
ధ్రువీకరణ పత్రం కోసం
దివ్యాంగుడి నిరీక్షణ
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్న రోజున ధ్రువీకరణ పత్రం పొందేందుకు వచ్చిన దివ్యాంగుడు ఆరు బయట నిరీక్షించాల్సి వచ్చింది. వివరాలలోకి వెళితే కొడంగల్ మండలం ఖాజావంత్‌పూర్ గ్రామానికి చెందిన ఈశ్వర్, వసంతలకు పుట్టిన సుశాంత్(4).. కాళ్లు, చేతులు ఆడవు, చెవుడు, కేవలం పాలు మాత్రమే తాగుతాడు. సుశాంత్ తండ్రి ఈశ్వర్ లారీపై పనిచేసి కుటుంబాన్ని పోషిస్తాడు. తల్లి వసంత సుశాంత్‌ను కంటికి రెప్పలా కాపాకుంటూ జీవనం సాగిస్తోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నారని, తన కొడుకుకు ధ్రువీకరణ పత్రం ఇస్తే కొంతైనా మేలు జరుగుతుందని భావించిన తల్లి సుశాంత్‌ను బుధవారం సభాస్థలికి తీసుకువచ్చి, హాలులోని ఆరు బయట పడుకోబెట్టింది.

తాండూరులో లారీ పార్కింగ్‌కు 12.3 ఎకరాల కేటాయింపు
తాండూరు పరిసరాల్లో లారీ పార్కింగ్‌కు 12.3 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు రవాణ శాఖ మంత్రి డాక్టర్ పీ.మహేందర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌తో కలిసి లారీ ఓనర్ల అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలోనే మొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో లారీ ఓనర్స్ అసోసియేషన్‌కు పెద్దెముల్ మండలంలోని కందనెల్లి గ్రామ సమీపంలో లారీ పార్కింగ్ స్థలంలో అన్ని హంగులతో కొత్త భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. భవన సముదాయానికి ఎంత ఖర్చయినా నిధులను వెచ్చించి ఆరు మాసాల్లో పనులు పూర్తిచేసి లారీ ఓనర్స్ అసోసియేషన్‌కి అప్పగిస్తామని పేర్కొన్నారు. తాండూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో కాలుష్య నివారణకు ప్టణానికి దూరంగా ఈ స్థలం కేటాయిస్తున్నామని అన్నారు. ఈ స్థలంలో దుకాణ సముదాయం, టాయిలెట్లు, స్నానాల గదులు, బట్టలు ఉతుక్కోడానికి ప్రత్యేక స్థలం, వంటగది, 150 మంది ఒకేసారి భోజనం చేసేందుకు వీలుగా డైనింగ్ హాల్‌తో పాటు వసతి సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సముదాయ కాపలాకు ఇద్దరు వాచ్‌మెన్లను నియమించి వసతి సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీటీవో ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ విరూపాక్షి, తాండూరు ఆర్డీవో వేణుమాధవ రావు, ఈడబ్ల్యూఐడీసీ డీఈఈ దుశ్యంత్ పాల్గొన్నారు.

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి
కీసర, డిసెంబర్ 6: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు, వికలాంగుల కాలనీల్లో వౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం పని చేస్తున్న స్వచ్చంద సేవా సంస్ధలను కొనియాడారు. వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వైద్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేలా అన్ని ప్రాంతాల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తామని అన్నారు. వికలాంగులకు వృత్తినైపుణ్యంలో శిక్షణ ఇప్పించేందుకు 21 సంస్థలను ఎంపిక చేశామని, శిక్షణ అనంతరం సర్ట్ఫికెట్‌తో పాటు, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో లక్షకుపైగా దివ్యాంగులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముద్ర, స్టార్టప్, గృహిణి మార్టు క్రింద విరివిగా రుణాలు మంజూరు చేయాలని అన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్ రెడ్డి మాట్లాడు దివ్యాంగుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.1500 పెంచామని అన్నారు. దివ్యాంగుల మహిళ స్వయం సహాయక సంఘాలకు కోటి ఏడు లక్షల చెక్కును, ట్రైసైకిళ్లు, పరికరాలు అందజేసారు. వివిధ పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేసారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల మహిళా సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ సువర్ణా రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమశాఖ అధికారి స్వరూపా రాణి, డీఆర్‌డీఓ కౌటిల్య, ఎంపీపీ సుజాత, సర్పంచ్ గణేశ్, ఎంపీటీసీ రమేశ్ గుప్తా పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లు వేగవంతంగా పూర్తి చేయాలి
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కీసర, యాద్‌గార్‌పల్లి, చీర్యాలలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు దసరా నాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ఇంతవరకు పూర్తికాకపోవటంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇతర జిల్లాలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభిస్తుంటే, మేడ్చల్ జిల్లాలో పూర్తికాకపోవటంపై అసహనం వ్యక్తం చేసారు. గుత్తేదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించినట్లయితే పనులు వేగం పుంజుకుంటాయని తెలిపారు. రెండవ విడత నిర్మాణాలకు సంబంధించి ఎస్టిమేట్ ప్రక్రియ పూర్తి అయినందున టెండర్లు పిలవాలన్నారు. డబుల్ బెడ్‌రూం నిర్మించే ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వౌలిక సదుపాయాలకు ఎంపీ, ఎమ్మెల్యే, సీఎస్‌ఆర్ నిధులు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకమీదట ప్రతి బుధవారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ చందర్‌సింగ్, పంచాయతీరాజ్ ఈఈ రామ్మోహన్, కీసర ఆర్డీఓ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

నాగోల్ మెట్రో రైలు స్టేషన్‌లో మాక్ డ్రిల్
ఉప్పల్, డిసెంబర్ 6: అగ్నిప్రమాదాల నివారణ కోసం నాగోల్ మెట్రో రైలు స్టేషన్‌లో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక కేంద్రం, మెట్రో రైలు యాజమాన్యం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆకస్మాత్తుగా ఫైర్ జరిగి మంటలు ఉవ్వెత్తున లేస్తే అదే సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికులను ఎలా రక్షించాలో అనే సన్నివేశం వంటి దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. ఫైర్ జరిగితే ఎలాంటి భయం లేకుండా ఒకేసారి తప్పించుకునే విధానంపై క్లుప్తంగా తెలియజేస్తూ మంటలను ఆర్పే విధానం వంటి నివారణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఫైర్ విభాగం అధికారులు హరినాథ్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.

భావితరాలకు స్ఫూర్తిప్రదాత అంబేద్కర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 6: భారత రత్న, రాజ్యాంగ కర్త అంబేద్కర్ గొప్ప దార్శనికుడు, సమాజ సేవకుడని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్‌రావు స్మరించుకున్నారు. బుధవారం ట్యాంక్‌బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, ఆ తర్వాత దోమల్‌గూడలోని టీడీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ రావు ఇతర నాయకులు నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు వనం రమేష్, బద్రినాథ్ యాదవ్, పీ.బాలరాజ్‌గౌడ్, ఆవుల అనీల్, బీ. శ్యాంసుందర్, ముప్పిడి మధుకర్, అనిల్‌చారి, కొరెపు శ్రీహారి, కనివేట నర్సింగ్, కొండమడుగు యాదగిరి, ముప్పిడి నర్సింగ్, నవీన్, కిరణ్, ఎం.నర్సింగ్, టీ.రవీందర్, లూకరాజు, మహిళా నాయకురాలు షకీలారెడ్డి, అనురాధ, శివ, టింకు, గోవింద్, షాహెద్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహాం వరకు రన్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
నాంపల్లిలో..
అంబేద్కర్ వర్ధంతిని బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి కాటేపతిగ అనిల్‌బాబు, రెడ్‌హిల్స్ డివిజన్ ఎస్సీ మోర్చా కార్యదర్శి కే.నరేష్ ఆధ్వర్యంలో నాంపల్లి దేవీబాగ్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ హరికిషన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నగర బీజేపీ కార్యదర్శులు, అధికార ప్రతినిధి ఎ.కాంతికిరణ్, ఆశారాం సోని, కే.పవన్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు కే.వేంకటేశ్వరస్వామి, శేషగిరి, నాంపల్లి బీజేపీ కన్వీనర్ బిజేందర్ కుమార్, కోకన్వీనర్ ప్రకాష్‌సింగ్, డివిజన్ అధ్యక్షుడు కొల్లూరి క్రాంతి కుమార్, కిషన్, విక్కీ, ప్రకాష్, నగేష్ అంబేద్కర్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా నివాళి అర్పించారు.
రాజేంద్రనగర్: భావితరాలకు అంబేద్కర్ స్ఫూర్తిదాయకమని శాసనసభ్యుడు టీ.ప్రకాష్‌గౌడ్ అన్నారు. అంబేద్కర్‌ను ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజేంద్రనగర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు కొలను సుభాష్‌రెడ్డి, సామ భూపాల్‌రెడ్డి, చలసాని విష్ణుమూర్తి, వై.శ్రీ్ధర్, ధర్మారెడ్డి, వనం నర్సింహ్మ, గడ్డం అరుణ్, కోరణి బాల్‌రాజ్, ధనుంజయ్, సామ ఇంద్రపాల్‌రెడ్డి, పంబాల రాజు, మ్యాడం రామేశ్వర్, ఎం నరుూముద్దీన్, సయ్యద్ ముజామిల్, మహిపాల్, రఘుముదిరాజ్, గుర్రంపల్లి శ్యామల్‌రాజ్, ఉమారెడ్డి, వీర్లపల్లి మహేష్, ఏ.సూర్యం, జోగి రవి, పచ్చ నర్సింగ్ రావు, తలారి శ్రీరాములు, టీఆర్ రాములు, ఏ.సుబ్బారావు పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఉడంగడ్డలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు రవీందర్, పెండ్యాల నర్సింగ్‌రావు, చిన్న కేబుల్ శ్రీను, సుధాకర్‌రెడ్డి, వెంకటయ్య, లక్ష్మి, శరణమ్మ, బుచ్చిరెడ్డి, జైరాజ్, రామకృష్ణారెడ్డి, రాజ్‌శేఖర్‌రెడ్డి, భూషణ్ పాల్గొన్నారు. హైదర్‌గూడ చౌరస్తాలో బీజేపీ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు సాబాద విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాక్షులు ఎన్.మల్లారెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ మోండ్ర కొమరయ్య, నాయకులు జెన్న పద్మారావు, సోమారం ప్రేమ్‌కుమార్, కాడెం సుధాకర్, అమృత, నాగమణి, కే.కిరణ్‌చారి, సులిగె వెంకటేష్, గొరిగె రాజు, వినోద్‌కుమార్, రావుల జనార్దన్, పుస్తకాల అశోక్, కే.జయప్రకాష్‌రెడ్డి, లక్ష్మికాంత్ వ్యాస్, సులిగె సతీష్, ఎస్.శ్రీపాల్‌రెడ్డి, సదానంద్, సాబాద సత్తయ్య, ఎస్.నరేష్, వినోద్‌సింగ్, అనిల్, భాస