మహబూబ్‌నగర్

విద్యకు అత్యంత ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 6: రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని అందుకే గత 42నెలల్లో 544గురుకులాలను ప్రారంభించామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. బుధవారం పట్టణంలోని ఎంవిఎస్ డిగ్రీకళాశాల, ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, పాలమూరు యూనివర్సిటీలో దాదాపు రూ.60కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రులు కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, జడ్పీ చైర్మన్ భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్‌లు చేశారు. ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమం మంత్రి కడియం శ్రీహరి చేపట్టారు. పలువురు విద్యార్థినిలను కళాశాలలో నెలకొన్న సమస్యలపై, ఆధ్యాపకుల బోధనపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు కవితకుమారి, జ్యోతిలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు విద్యార్థినిలు వారు చదువుతున్న బైపిసీ గ్రూపులోని పలు అంశాలను కడియం ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో విద్యార్థినిలు సమాధానం చెప్పలేకపోయారు. ఈ నేపథ్యంలో మరో విద్యార్థిని రేణుకను సోడియం క్లోరైడ్ ఎలమెంట్స్, తదితర అంశాల గురించి మంత్రి ప్రశ్నలు వేశారు. వీటిని రేణుక విద్యార్థిని సమాధానం చెప్పింది. వెంటనే రూ.1000 ప్రొత్సహక బహుమతి అందజేశారు. అయితే అధ్యాపకులను మంత్రి పలు ప్రశ్నలు వేశారు. సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో వారిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ప్రశ్నలు అడుగుతున్న సమయంలో అధ్యాపకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇంతలోపే మంత్రి వారిని తమ స్థానాల్లోకి వెళ్లిపోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లోని నాలుగు కళాశాలలకు రూ.10కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అధ్యాపకులు నేరుగా తరగతి గదికి వచ్చి సబ్జెక్టును బోధిస్తే అర్థం కాదని తెలిపారు. అధ్యాపకులు ఇంటి దగ్గర సబ్జెక్టును హోంవర్క్ చేసి తరగతిగదిలో బోధించినట్లు అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపళ్లు వెంకటయ్య, బిబి ఓనాబ్, ఫరిదాబేగం, నాయకులు రాజేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రం అభివృద్ధి
మంత్రి లక్ష్మారెడ్డి
ధన్వాడ, డిసెంబర్ 6: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఎర్పాటుచేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ సకలజనుల సమ్మెవలన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి ప్రణాళికలు ప్రజాసంక్షేమం కోసం ప్రవేశపెడుతున్నారని వివరించారు. మరికల్ మండల ప్రజలు అంబేద్కర్ విగ్రహం ఎర్పాటు ముందుకు వచ్చినందుకు ఆయన ప్రజలను అభినందించారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహలను ఎర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యంగం ప్రకారం చట్టాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రజలు కోరకుండానే నిరుపేదల ముంగిట్లోకి సంక్షేమపథకాలు అందిస్తున్న ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు. నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేంధర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిగ్రామంలోని దళితవాడల్లో సిసిరోడ్లు, డ్రైనేజిలు నిర్మాణాలు ఎర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కె.వీరారెడ్డి, మాకీ మంత్రి రాములు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, నారాయణపేట మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మరికల్ గ్రామసర్పంచ్ జోగులక్ష్మీ, ధన్వాడ ఎంపిపి శశికళ, టీఆర్‌ఎస్ మండల నాయకులు రామస్వామి, ఎల్.బుచ్చప్ప, జగదీశ్వర్, ఎల్.రాములు, రాజేంధర్‌రెడ్డి, అశోక్‌కుమార్, కృష్ణమోహన్, టీఎమ్మార్పిఎస్ రాష్టన్రాయకులు ఇటుక రాజు, మరికల్ ఎంఇఓ మధుసుధన్‌రెడ్డి, మరికల్ ఎంపిటీసీలు కస్పేసౌభాగ్యలక్ష్మీ, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

గ్రావిటీ కెనాల్ తెగిపోవడంతో
పంట పొలాల్లోకి నీరు
ధరూరు, డిసెంబర్ 6: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా గుర్రందొడ్డి రిజర్వాయర్ నుండి ర్యాలంపాడు రిజర్వాయర్‌కు వస్తున్న గ్రావిటీ కెనాల్ మన్నాపురం సమీపంలో తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారి చక్రధర్‌కు వివరించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మన్నాపురం గ్రామస్తులు మండిపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి గ్రావిటీ కెనాల్ తెగి పంట పొలాలలోకి నీరు రావడంతో రైతులు, గ్రామస్తులు గుడ్డందొడ్డి పంప్‌హౌస్‌కు వెళ్లి ఆందోళన చేశారు. అప్పటికే ఎల్లప్ప, మమతలకు చెందిన 80 బస్తాల వరిధాన్యం నీటిలో మునగగా, మరో ఐదు మంది రైతుల వరి పంట జలమయమైంది. ఈ విషయంపై రైతులు అధికారుల బాధ్యతారహితం కారణంగా పెనుప్రమాదం జరిగేదని, కెనాల్ తెగిపోయి ఉంటే చెరువులకు గండ్లు పడి పంట పొలాలు నాశనమయ్యేటివని ఆందోళన చెందారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
హోంగార్డుల అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎస్పీ
వనపర్తి, డిసెంబర్ 6: వనపర్తి జిల్లా సాయుద దళాల పరెడ్ మైదానంలో బుదవారం నిర్వహించిన హోగార్డుల 55వ అవతరణ దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొని హోంగార్డుల సాయుద వందనాన్ని స్వీకరించారు. హోగార్డులు వత్తిడికి లోను కాకుండ విధులు నిర్వహించాలని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు రోజు వ్యాయామం చేయాలన్నారు. అనంతరం హోగార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇనిస్పెక్టర్ వెంకటేశ్, పిఆర్‌ఓ రాజగౌడ్, హోగార్డుల సంఘం జిల్లా అద్యక్షులు కృష్ణసాగర్ పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య
ఉపాధ్యాయులకు మంత్రి కడియం సూచన

ఇటిక్యాల, డిసెంబర్ 6: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని బీచుపల్లి గ్రామంలో తెలంగాణ బీచుపల్లి గురుకుల పాఠశాలలో నూతనంగా రూ.2.95 కోట్ల వ్యయంతో నిర్మించిన డార్మెంట్, డైనింగ్ హాల్, కాంపౌండ్‌వాల్, ఓహెచ్‌ఆర్ ట్యాంక్‌లను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్‌ఏ సంపత్‌కుమారు అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి కడీయం శ్రీహరి, పంచాయతిరాజ్ శాఖమంత్రి జూపల్లికృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డిలు హాజరయ్యారు.
ముందుగా డాక్టర్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేజీటుపీజీ విద్యను ప్రారంభించడం జరిగిదంన్నారు. విద్యపట్ల ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులను రాబోయే 10వ తరగతి ఫలితాలలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం నిలిపేందకు కృషి చేయాలని ఆదేశించారు. బీచుపల్లి గురుకుల పాఠశాలను 5వ తరగతి నుండి జూనియర్ కళశాల వరకు బోధించనున్నట్లు వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 8 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వారి వౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.116 కోట్లను ఖర్చుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మెన్ బండారి భాస్కర్, జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ, జిల్లా విద్యాధికారి వేణుగోపాల్, అలంపూర్ మార్కెట్ చైర్మెన్ పటేల్‌విష్ణువర్ధన్‌రెడ్డి, ఇటిక్యాల జడ్పీటీసీ ఖగునాథ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి, ఎంపీటీసీ నాగేష్, స్థానిక సర్పంచ్ మర్యమ్మ, జయరామయ్యశెట్టి, ఎర్రవల్లి రవితో పాటు అయాశాఖల అధికారులు విద్యార్థులు, తెరాస, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మహిళా పాలిటెక్నిక్ భవనం ప్రారంభం
పెబ్బేరు, డిసెంబర్ 6: పెబ్బేరు మండల కేంద్రంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలను 7.65 కోట్లతో నిర్మించిన భవనాన్ని బుదవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కలెక్టర్ శే్వతా మహంతిలు ప్రారంభించారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు పెట్టెలు, రీడింగ్ చైర్ తదితర స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మెన్ బండారి భాస్కర్, విద్యాశాఖ వౌళిక వసతుల చైర్మెన్ నాగేంద్రం గౌడ్, డిఇఓ సుశీందర్ రావు, ఆర్డీఓ చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ బుచ్చారెడ్డి, ఎంపిపి పద్మావతి, జడ్పీటిసి ప్రకాశ్, సర్పంచ్ అక్కిసుశీల, ప్రిన్సిపాల్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు కృషి
* అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
ధన్వాడ, డిసెంబర్ 6: అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు నివాళ్లు ఆర్పించారు. ఈసందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను అమలు పర్చడంలేదని, దోరలపాలన కోనసాగుతుందన్నారు. దళితులను రాష్టమ్రుఖ్యమంత్రిగా చేస్తామని చేసిన కేసిఆర్ నేడు మాటను నిలబెట్టుకోలేదన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమావ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేట్టివీరబసంత్‌కుమార్, ధన్వాడ మండల సింగిల్ విండో చైర్మన్ నాగూల నిరంజన్‌రెడ్డి, మండలకాంగ్రెస్ నాయకులు రాఘవేంద్ర, రాజారెడ్డి, కృష్ణయ్య, మరికల్ ఎంపిటీసీ కస్పే శ్రీనివాసులు, జంగూల్‌సాబ్, రవికుమార్‌గౌడ్, హన్మంతు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేటలో...
నారాయణపేటటౌన్: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేద్దామని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, టిఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్‌పాండురెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ప్రభాకర్‌వర్దన్, రాష్ట్ర నాయకుడు జాజాపూర్ సిద్రామప్ప, మున్సిపల్ వైస్ చైర్మన్ నందునామాజీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ లౌకిక దేశంలో అన్నీ వర్గాలకు సమాన న్యాయం చేసేందుకు రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.