తెలంగాణ

ఇక కేంద్రంతో కొట్లాటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నప్పటికీ వివిధ అంశాలపై కేంద్రంతో తగువు పెట్టుకోకతప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రంతో తేల్చుకోవడానికి టిఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు, హైకోర్టు విభజన, షెడ్యూల్డ్ 9, 10 సంస్థల విభజన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలన్నీ కేంద్ర పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు తాజాగా బిసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శాసనసభలో చేసిన తీర్మానంపై కేంద్రంపై వత్తిడికి బిసీ ప్రజా ప్రతినిధుల అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మైనార్టీల రిజర్వేషన్ల పెంపుపై శాసనసభలో చేసిన తీర్మానంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అంశంపై ప్రధానితో జరిగిన భేటీలో ఇదివరకే ప్రస్తావించగా సానుకూలంగా స్పందించినట్టు శాసనసభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. తమిళనాడు తరహాలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై అవసరమైతే జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కూడా వెనుకాడేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేసారు.
తెలంగాణ ప్రభుత్వ వాదనతో తాము పూర్తిగా ఏకీభవించడంతో పాటు కేంద్రంపై వత్తిడికి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగితే మద్దతు ఇస్తామని తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇటీవల లేఖ రాసారు. దీనికి తోడు రాష్ట్ర విభజన జరిగి మూడున్నర ఏళ్లు గడిచినా ఇప్పటికీ హైకోర్టు విభజన జరగలేదు. అలాగే షెడ్యూల్డ్ 9, 10 సంస్థల విభజన కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ అంశాలపై కూడా కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై గుర్రుగా ఉంది. కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పటికీ కేంద్ర పరిధిలో పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలపై గళం ఎత్తకతప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం పరిధిలోని అంశాలపై ఇప్పటికైన సత్వర నిర్ణయం తీసుకోవాలని వత్తిడికి ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో నిమగ్నమైన రాష్ట్ర ప్రభుత్వం ఇవీ ముగిసాక ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. మైనార్టీలకు రిజర్వేషన్ల పెంచడానికి కేంద్రం అంగీకరించని పక్షంలో న్యాయ పోరాటం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే. తమిళనాడులో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు తమకు ఎందుకు ఇవ్వరని గట్టిగా వాదన వినపించడానికి తెలంగాణ సర్కార్ అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.