ఆంధ్రప్రదేశ్‌

జైలు పక్షులా విమర్శించేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: ‘జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల కోసం వారి అవమానాలన్నీ భరిస్తున్నాన’ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి వైకాపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సిఎం నివాసం బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం కోసం తాను రాత్రి, పగలు ఆలోచన చేస్తున్నానని, నిధుల కొరత ఉన్నా, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నానని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీలతో జీవించానని, జైలుకు వెళ్లి వచ్చిన వారు తనపై ఆరోపణలు చేస్తే, బాధగా ఉందని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డిని నమ్ముకుని పనిచేసిన వారంతా జైలుకు వెళ్లారని, తన హయాంలో పనిచేసిన అధికారులు ఉన్నత శిఖరాలను అధిరోహించారని చంద్రబాబు అన్నారు. అవినీతిని నియంత్రించి ప్రజాధనాన్ని ఆదా చేశానని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్షం ఆరోపణలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వ్యవసాయ, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేశానన్నారు. కులాలు, మతాల పేరుతో కొంతమంది రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం జరుగుతున్న అభివృద్ధిని చూసి వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని, వారు అమ్ముడుపోవడం లేదని చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమల్లోకి తీసుకువచ్చామని, మైనార్టీ బడ్జెట్ పెంచామని, కాపులకు, బ్రాహ్మణులకు ప్రత్యేక నిధులు కేటాయించామని అన్నారు. మరో రెండు నెలల్లో రాజధాని రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్‌లు అందచేస్తామని ఆయన చెప్పారు. నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే బాధ్యత తనపై ఉందని అన్నారు.
అంతకు ముందు గొట్టిపాటి రవికి తెలుగుదేశం కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. రవికుమార్‌తోపాటు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, సింగిల్ విండో చైర్మన్‌లు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, సిద్దా రాఘవరావు, దేవినేని ఉమ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
chitram...
టిడిపిలోకి గొట్టిపాటి రవికుమార్‌ను ఆహ్వానిస్తున్న చంద్రబాబు