తెలంగాణ

పోలీసులకు అమెరికా కాన్సులేట్ ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ పోలీసులకు అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రశంసించింది. ప్రపంచ పారిశ్రామిక, పెట్టుబడిదారుల సదస్సును చాలా బాగా నిర్వహించారని అమెరికా కాన్సులేట్ కితాబు ఇచ్చింది. భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని డీజీపీ మహేందర్‌రెడ్డిని అభినందిస్తూ అమెరికా కాన్సులేట్ జనరల్ లేఖ రాసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులకు తగిన భద్రత, ఏర్పాట్లు బాగున్నాయంటూ అమెరికా కాన్సులేట్ తెలంగాణ పోలీసులను అభినందించింది. ఇండియా-అమెరికా సంబంధాలు మరింత బలపడాలని కాంక్షిస్తూ, తెలంగాణ పోలీసులకు కాన్సల్ జనరల్ కాథెరిన్ బి హడ్డా కృతజ్ఞతలు తెలిపారు.