తెలంగాణ

అన్ని ఆర్టీసీ డిపోల వద్ద 12న యూనియన్ గేట్‌మీటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద గేట్ మీటింగ్ నిర్వహించతలపెట్టినట్టు టీఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి తెలిపారు. గత నెల 29న జరిగిన యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో గుర్తింపు సంఘం కార్మిక వ్యతిరేక చర్యలను విశే్లషించింది. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక, సంస్థాగత సమస్యలపై పోరాడాలని నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.
గత ఏప్రిల్ ఒకటిన సవరించిన పే స్కేల్ అమలు కాలేదని, తొమ్మిది నెలలు గడుస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. 62శాతం ఫిట్‌మెంట్‌తో పే స్కేలు అమలు జరగాలని, లేదా 30శాతం ఐఆర్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కొన్ని విభాగాల మూసివేతలు ఆపాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని, రిటైర్డ్ పోస్టుల్లో అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
కార్మికులపై వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, అద్దె బస్సులను తొలగించి ఆర్టీసీ బస్సులను నడపాలని పేర్కొన్నారు. డిస్పెన్సరీలలో డాక్టర్లు రాసిన అవసరమైన మందులు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న మెడిప్లస్ షాపుకు పోయి తీసుకునే విధానాన్ని ఆయన ఖండించారు. తార్నాక ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ మందుల విభాగాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా యూనియన్ పనిచేస్తోందని, యూనియన్ ఆధ్వర్యంలో జరిగే గేట్ మీట్‌లో అందరూ పాల్గొనాలని రాజిరెడ్డి కోరారు.