తెలంగాణ

సంస్థ విజయం ఉద్యోగుల చేతుల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: సమర్ధులు, అంకితభావం కలిగిన ఉద్యోగులపైనే ఏ సంస్థ విజయమైనా ఆధారపడి ఉంటుందని భారత రైల్వే బోర్డు చైర్మన్ అశ్విన్ లోహాని అన్నారు. ఒక సంస్థకు నిధులు, వస్తువనరులు ఎంతగానో అవసరమైనప్పటికీ, ఆ సంస్థ విజయం మాత్రం ఆ ఉద్యోగుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. గురువారం నాడిక్కడ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 92వ బ్యాచ్ అఖిల భారత సర్వీసు అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ రంగంలో మిగతా అంశాలకు ఇచ్చినంత ప్రాధాన్యత మానవ వనరులకు ఇవ్వడం లేదని అన్నారు.
ప్రభుత్వ సంస్థల్లోని అన్ని స్థాయిల్లోని అధికారులు నాయకులుగా మారి అసాధారణ నైపుణ్యాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించాలని కోరారు. ప్రైవేటు రంగ సంస్థలకు ధీటుగా విజయవంతమయ్యే సత్తా ప్రభుత్వ రంగ సంస్థలకు ఉందని లోహాని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలను శక్తిమంతమైన, పోటీ తత్వంతో కూడిన సంస్థలుగా తీర్చిదిద్దేందుకు గాను విధానాల్ని సులభతరం చేయడం, నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
తాను పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్, ఎయిరిండియా, భారత రైల్వేల సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఎదురైన, ఎదురవుతున్న కొన్ని అనుభవాలను ఆయన ఈ సందర్భంగా శిక్షణలోని అఖిల భారత సర్వీస్ అధికారులకు లోహాని వివరించారు. హబీబ్ క్లబ్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన అధికారులకు లోహాని బహుమతులు ప్రదానం చేశారు. హెచ్‌ఆర్‌డి డైరక్టర్ జనరల్ ఆచార్య ఈ సందర్భంగా రైల్వే బోర్డు చైర్మన్ లోహానికి జ్ఞాపికను అందజేశారు.

చిత్రం..హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో హబీబ్ క్లబ్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన అధికారులకు బహుమతులు అందజేస్తున్న భారత రైల్వే బోర్డు చైర్మన్ అశ్విన్ లోహాని.