ఆంధ్రప్రదేశ్‌

జపాన్‌తో చెట్టపట్టాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ/వరదయ్యపాల్యెం, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్‌కు జపాన్‌తో విడదీయరాని అనుబంధం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని రంగాల్లోనూ జపాన్‌తో కలిసి పనిచేస్తామని.. ఏపీలో పెట్టుబడి పెట్టే జపాన్ కంపెనీలకు అన్ని విధాలైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దు శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు మోటా ర్స్ సంస్థ తయారు చేసిన మొట్టమొదటి ఇండి యా మేడ్ డి-మాక్స్ వాహనం రెండో ప్లాంట్‌ను సిఎం బుధవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో సిఎం మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర గలిగిన ఇసుజు మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లో తమ శాఖ స్థాపించ డం అభినందనీయమని అన్నారు. ఇసుజు మోటార్స్‌కు రోడ్డు టాక్స్ మినహాయింపునిచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆంధ్రరాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగాఉందని అన్నారు. శ్రీసిటిలో మోటారు రంగానికి సంబంధించి ఇది రెండవ అతిపెద్ద కంపెనీ అన్నారు. ప్రస్తుతం 70శాతం వరకు జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఉత్పత్తులను ప్రారంభించిందని త్వరలోనే దానిని వంద శాతానికి పెంచాలని సిఎం ఆకాంక్షించారు. దేశంలోనే శ్రీసిటీ పారిశ్రామికవాడలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని అన్నా రు. ఇందుకు కారణం ప్రభుత్వ అనుమతులు త్వర గా లభించటం, రవాణా మార్గాలు, నీటి లభ్యత వంటి సౌకర్యాలు ఉండటం అని సి ఎం చెప్పారు. తన విదేశీ పర్యటనలలో భాగంగా జపాన్‌లో పర్యటించానని, నిన్నటి వరకు 400 ఎంఓయులు జరిగాయని అన్నారు. ఆటోమొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 12.7 శాతం వృద్ధి సాధిస్తోదని, మోటారు రంగానికి అత్యధిక మార్కెట్ మన దేశంలోనే ఉందని సిఎం స్పష్టం చేశారు. 15 జపనీస్ కంపెనీలు ఇప్పటికే అనుమతులు పొందాయని అన్నారు. శ్రీసిటీలో మూడు వేలమందికి ఉపాధి కల్పిస్తున్న ఇసుజు మోటార్స్ తన 50వేల ఉత్పత్తుల నుంచి 1లక్ష 20వేలకు పెంచే లక్ష్యంతో ఉందన్నారు. తద్వారా మరికొంతమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇసుజు మోటార్స్ అభ్యర్థన మేరకు రోడ్డు టాక్స్‌ను మినహాయింపు ఇచ్చే చర్యలు చేపడతామన్నారు. శ్రీసిటీలో ఉద్యోగస్తులకు అందుబాటులో ఉండేలా శ్రీసిటి యాజమాన్యం 6 నెలల్లో 5వేల గృహల నిర్మాణానికి చర్యలు చేపడుతుందని చెప్పారు. శ్రీసిటీలో ఫైర్ స్టేషన్, డి ఎస్పీ పర్యవేక్షణలో హైటెక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.120 యూనిట్లు శ్రీసిటీలో ఏర్పాటు చేయడం జరిగిందని, 26 దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయన్నారు. ఈసందర్భంగా సి ఎం చంద్రబాబు నాయుడు శ్రీసిటీలో తయారైన అడ్వంచర్ యుటిలిటీ వాహనాన్ని ప్లాంట్ నుండి బయటకు నడిపారు. ఈకార్యక్రమంలో జపాన్ దేశపు భారత రాయబారి కెంజిహిరామత్సు, ఇసుజుమోటార్స్ అధ్యక్షులు మసనోరి కటయామా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కజుషి ఒకావా, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, రాష్ట్ర మంత్రులు నారాయణ, బి.గోపాలకృష్ణారెడ్డి, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , కంపినీ ప్రతినిధులు, శ్రీసిటీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

ఇసుజు సంస్థ కార్ల పరిశ్రమ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సిఎం