తెలంగాణ

దేశానికే తలమానికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీ సమావేశంలో 15 కీలక తీర్మానాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, శాంతి భద్రతలు, విభజన చట్టం హామీలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై పార్టీ నేతలు తీర్మానాలు ప్రవేశపెట్టగా ప్రతినిధులు, నేతలు హర్షద్వానాల మధ్య ఆమోదం తెలిపారు. తీర్మానాలు చేసే సమయంలో ప్రతినిధుల నుంచి వచ్చిన సానుకూల స్పందన చూసి సిఎం హర్షం వెలిబుచ్చారు. తెలంగాణ సంక్షేమం- దేశానికే తలమానికం అనే తీర్మానాన్ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రతిపాదించగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి బలపర్చారు. గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్లాలి- మేజర్ ఇరిగేషన్‌తో పసిడి సిరులు పండాలి అనే అంశంపై తీర్మానాన్ని రాష్టమ్రంత్రి హరీశ్‌రావు జిల్లాల వారీగా వివరిస్తూ ప్రతిపాదించగా తెరాస లోక్‌సభ ఫ్లోర్ లీడర్ జితేందర్‌రెడ్డి బలపర్చారు. కాకతీయుల జల కళ, పునరుజ్జీవం- మిషన్ కాకతీయ అంశంపై తీర్మానాన్ని వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ్రతిపాదించగా ప్రభుత్వ విప్ సునిత బలపర్చారు. తెలంగాణ రక్షణ చక్రం-మిషన్ భగీరథ అంశాన్ని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే వీరేషం బలపర్చారు. కెసిఆర్ ఆత్మగౌరవ పథకం-డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం తీర్మాణాన్ని ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు ప్రతిపాదించగా ఎమ్మెల్యే సురేక బలపర్చారు. పల్లెకు ఫలసాయం-తెలంగాణ వ్యవసాయం అంశంపై తీర్మానాన్ని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించగా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ బలపర్చారు. విశ్వ నగరంగా హైదరాబాద్, తెలంగాణ పారిశ్రామిక ఐటి విధానం అంశాలపై తీర్మానాలను రాష్టమ్రంత్రి కెటిఆర్ ప్రతిపాదించగా హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ బలపర్చారు. తెలంగాణ నిరంతర విద్యుత్ అంశంపై తీర్మానాన్ని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రతిపాదించగా మరో మంత్రి శ్రీనివాస్‌యాదవ్ బలపర్చారు. కెజిటుపిజి విద్య అంశాన్ని ఎంపి సుమన్ ప్రతిపాదించగా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ బలపర్చారు. కృష్ణ పుష్కరాలపై తీర్మానాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతిపాదించగా నల్గొండ జడ్పీ చైర్మన్ బాలునాయక్ బలపర్చారు. శాంతి, భద్రతల పరిరక్షణపై తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రతిపాదించగా ఎమ్మెల్సీ రాములునాయక్ బలపర్చారు. విభజన చట్టం హామీలపై తీర్మానాన్ని ఎంపి వినోద్‌కుమార్ ప్రతిపాదించగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ బలపర్చారు. నీటి ఎద్దడి నివారణ చర్యలపై తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించగా ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి బలపర్చారు. తెలంగాణ హరితాహారంపై తీర్మానాన్ని మంత్రి జోగు రమాన్న ప్రతిపాదించగా ఎమ్మెల్యేబాలరాజు బలపర్చారు. కాగా రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్ మాట్లాడుతున్న సమయంలో ప్రతినిధుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
chitram...
ప్లీనరీలో మాట్లాడుతున్న కెసిఆర్. హాజరైన మహిళా ప్రతినిధులు