తెలంగాణ

కాంగ్రెస్‌ది అధికార దాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 10: అధికారం లేకుండా ఉండలేని కాంగ్రెస్ నాయకులు నేడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు, అధికార దాహంతో రాజకీయ పునరేకీకరణ ప్రయత్నాలు చేస్తున్నార ని భారీ నీటిపారుదల శాఖ శాఖ మంత్రి టి.హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం మంత్రి జి.జగదీష్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి నాగార్జున సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ నాడు తెలంగాణ ఉద్యమకాలంలో రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ వచ్చాకా అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణకు కృషి చేసిందన్నారు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ మాత్రం అధికార దాహంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ పునరేకీకరణ కోరుతోందన్నారు. కాంగ్రెస్ రాజకీయ పునరేకీకరణ అధికార దాహం కోసమైతే తమ పునరేకీకరణ ప్రయత్నం తెలంగాణ అభివృద్ధి దాహమని హరీష్ అన్నారు. అధికారమే పరమావధిగా సిద్ధాంతాలు, భావస్వారూప్యతలను వదిలి, తెలంగాణను వద దన్న సీపీఎంతో సైతం చెట్ట్టపట్టాలేసుకుంటూ రాజకీయ పునరేకీకరణ కోరుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోసం తహలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం నాడు రాజీనామాలు చేయాలని టీజేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీలు కోరితే ఆనాడు పారిపోయిన కాంగ్రెస్, టీడీపీ నాయకులంతా నేడు తెలంగాణను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారన్నారు. తాము రాజీనామాలు చేసి పదవీ త్యాగాలు చేసి ప్రజాకోర్టులో నిలబడితే కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాత్రం రకరకాల నాటకాలతో రాజీనామాలు చేయకుండా పారిపోయారన్నారు. నల్లగొండ జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్‌కు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు, సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై కోర్టు కేసులతో, గ్రీన్ ట్రిబ్యునల్ కేసులతో కాంగ్రెస్ అడ్డుపడిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే కట్టినవేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటాన్ని హరీష్‌రావు తప్పుబడుతూ కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ తెలంగాణ ప్రజలను ముంచి ఆంధ్రకు నీళ్లిచ్చేందుకు కట్టినవేనన్నారు. 28 గ్రామాలు, 14 వేల ఎకరాలను, 12 వేల మంది ప్రజలను ముంచి పులిచింతలను కట్టి ఆంధ్రకు మూడో పంటకు నీరిచ్చిన నిర్వాకం కాంగ్రెస్‌దేనన్నారు. ఆనాడు ఎన్నికలకు ముందు వ్యతిరేకించిన ఉత్తమ్ సహా నల్లగొండ కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల పిదప దగ్గరుండి పులిచింతలను కట్టించిన ఘనులంటు విమర్శించారు. హైదరాబాద్-ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఒప్పందం మేరకు నందికొండ దగ్గర నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు పదిలక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు 132 టీఎంసీలు ఇవ్వాలని నిర్ణయించగా 14 కిలోమీటర్లు దిగువకు సాగర్‌ను కట్టడం ద్వారా 106 టీఎంసీలు తగ్గించి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఆధునీకరణ పనుకు 2008 నుండి 2014 వరకు ఆరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం పనులు మాత్రమే చేసి 573 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హాయంలో మూడేళ్లలో 1265 కోట్లు ఖర్చు చేసి 65 శాతం పనులు పూర్తి చేశామని, మరో ఐదుశాతం పనులు మాత్రమే ఉన్నాయన్నారు. ఏప్రిల్ నుండి జూన్ లోపు అసంపూర్తి పనులన్నింటినీ పూర్తి చేయిస్తామని ఇదే తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఇతర రాష్ట్రాల సీఎంలు, నీతి ఆయోగ్‌లు ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.