తెలంగాణ

రాష్ట్రంలో భూ ప్రక్షాళన 90 శాతం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమం రాష్ట్రంలో 90 శాతం పూర్తయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ చెప్పారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వగృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భూ ప్రక్షాళన చేపట్టడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు.
భూ సమస్యలన్నీ దాదాపు పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. 1934 సంవత్సరం తర్వాత భూ ప్రక్షాళన చేపట్టడం దేశంలోనే ప్రథమమని అన్నారు. భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని గ్రామాల్లో స్వాగతిస్తున్నారని అన్నారు. ఈ నెలలో భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 94 శాతం, ఆర్మూర్ నియోజకవర్గంలో 92 శాతం భూ ప్రక్షాళన కార్యక్రమం పూర్తయిందని అన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన అన్నారు.
ముస్లింల అభివృద్ధికి సీఎం కృషి
ముస్లింల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ముస్లింల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, రుణాలు, షాదీ ముబారక్ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 23,800 మందికి షాదీముబారక్ కింద డబ్బులు అందజేశామని అన్నారు. గతంలో ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసేవారని, నేడు కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా, ఎంపీపీ పోతు నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు సంజయ్‌సింగ్ బబ్లూ, యామాద్రి భాస్కర్, మలిక్‌బాబా, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో విలేఖరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ