తెలంగాణ

అమెరికాలో టిఆర్‌ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: అమెరికాలోని సియాటెల్ నగరంలో తొలిసారిగా టిఆర్‌ఎస్ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలుగా తమ వంతు సహకారం అందిస్తామని కార్యక్రంలో ఎన్‌ఆర్‌ఐ సుధీర్ జలగం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలుత ప్రాణాలు అర్పించిన అమరవీరులకు రెండు నిమిషాలు వౌనం పాటించి సమావేశాన్ని ప్రారంభించారు. వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు తెలంగాణ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయాలని సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చేయూత నివ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో విదేశాల్లో ఉన్న తెలంగాణ మేధావులు, విద్యావంతులు తమ సలహాలు ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ నుండి సియాటెల్ పర్యటనకు వచ్చిన మురళీధర్‌రెడ్డి, జలగం రంగారావు తెలంగాణ ఉద్యమంలో తమ అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. స్థానికంగా ఉన్న తెలంగాణ వారందరూ తరుచుగా సమావేశం అవుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టుకోవాలని అన్నారు. సమావేశంలో వంశీరెడ్డి, విక్రం గార్లపాటి, చంద్ర సుంకే. శ్రీ్ధర్ జలగం, నవీన్ గడ్డం, నవీన్ గోలి, హరి,సాయి, మహేశ్, రాహుల్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

chitram అమెరికాలోని సియాటెల్ నగరంలో టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు