తెలంగాణ

పది జిల్లాలే ప్రాతిపదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: పాత పది జిల్లాల ప్రాతిపదికపైనే ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం తాజాగా జీవో 33ను జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల ప్రాతిపదికపై ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం గత అక్టోబర్ 10న జీవో -25ను జారీ చేసింది. ఆ జీవోను సవరించుకుని పాత జిల్లాల ప్రాతిపదికపైనే నియామకాలు జరపాలని హైకోర్టు ఆదేశించడంతో తదనుగుణంగా ప్రభుత్వం పాత జీవోకు సవరణలు చేసింది. టీచర్ల నియామకానికి జిల్లా అధికారి డిఇఓ కాగా, ఆ నిర్వచనాన్ని కొత్త జీవోలో ప్రభుత్వం తొలగించింది. డిఇఓను ఉంచితే కొత్త సవాళ్లు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం తెలివిగా ఆ అంశాన్ని తొలగించింది. అదే విధంగా 31 జిల్లాల స్థానే 10 జిల్లాల అంశాన్ని చేర్చింది. ఎస్టీ అభ్యర్ధుల అంశాన్ని మాత్రం యథాతథంగా కొనసాగించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు 10 జిల్లాల ప్రాతిపదికపై పోస్టులను విభజించారు. ఆ మేరకు పాత నోటిఫికేషన్‌కు సవరణలు ఇస్తూ సర్వీసు కమిషన్ ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధం చేసింది. ఒకటి రెండు రోజుల్లో నవీకరించిన షెడ్యూలును పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రకటించనుంది.