తెలంగాణ

రూ.20 వేల కోట్లతో బీసీ సబ్-ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: వెనుకబడిన వర్గాలకు రూ.20 వేల కోట్లతో సబ్-ప్లాన్ ఏర్పాటు చేయాలని, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్ తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారిని కోరారు.
సోమవారం స్పీకర్ మధుసూదనాచారికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బిజెపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేష్, నందగోపాల్, రామలింగం తదితరులు వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్‌లో బిసి మంత్రులు, ఎమ్మెల్యేలతో బిసి సంక్షేమ సంఘం నేతలు సమావేశమయ్యారు. అన్ని కుల సంఘాలకు 10 ఎకరాల భూమి, 10 కోట్ల బడ్జెట్ కేటాయించాలని వారు కోరారు. చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ప్రధానితో చర్చలు జరపాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బిసిలకు 50 శాతం అసెంబ్లీ, పార్లమెంటు టిక్కెట్లు ఇవ్వాలని వారు కోరారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని వారు కోరారు.
సర్వీస్ కమిషన్‌ను ముట్టడిస్తాం: కృష్ణయ్య
గ్రూపు-2 ఉద్యోగాలకు వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిఎస్-పిఎస్‌సి)ను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. సోమవారం బీసీ భవన్‌లో జరిగిన గ్రూపు-2 సెలెక్టెడ్ అభ్యర్థుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రభుత్వం చొరవ తీసుకుని హైకోర్టులో ఉన్న ‘స్టే’ ఎత్తి వేయించడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. గ్రూపు-2 అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్‌కు చాలా సమయం తీసుకుంటున్నారని అన్నారు.
పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా జరిపే రిక్రూట్‌మెంట్లకు 6 నెలల నుంచి 12 నెలల సమయం తీసుకుంటున్నారని అన్నారు. కానీ గ్రూపు-2 ఉద్యోగాలకు 24 నెలలు గడిచినా ఇంకా పూర్తి కాలేదని ఆయన తెలిపారు. ఇప్పుడు హైకోర్టు స్టే ఎత్తివేసినా ఇంటర్వ్యూలు, తదితర ప్రక్రియలు పూర్తి చేయడానికి మరో నాలుగు నెలలు పడుతుందని ఆయన చెప్పారు. ఇంటూర్వ్యూ సెలెక్ట్ అయిన 3 వేల మంది తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారని కృష్ణయ్య తెలిపారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, రామలింగం తదితరులు ప్రసంగించారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో స్పీకర్ మధుసూదనాచారితో సమావేశమైన
బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, బీజేపీ నేత లక్ష్మణ్