తెలంగాణ

రూ.18వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: రహదారి భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రహదారుల భద్రతకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సోమవారం ఇక్కడ జరిగింది. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రులు కె. తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రహదారి ప్రమాదాలు, భద్రతపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో 64 వేల ప్రమాదాలు జరిగాయని, 21,235 మంది మరణించారని తుమ్మల తెలిపారు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం నియమాలను అతిక్రమించిన వారి నుండి 124 కోట్ల రూపాయలు అపరాధ రుసుం వసూలు చేశారన్నారు. రోడ్ల నిర్మాణంలో లోపాల వల్ల 20 శాతం ప్రమాదాలు జరుగుతుండగా, వాహన చోదకుల తప్పు వల్ల 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రహదారుల భద్రతను ఏ శాఖకు అప్పగించాలన్న అంశంపై చర్చించామని, తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రహదారి భద్రత అథారిటీ, రోడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటు, రహదారి భద్రతా నిధి ఏర్పాటు,ప్రమాదాలు జరగని విధంగా రోడ్ల నిర్మాణం, నిర్వహణ, 15 ఏళ్లపైబడ్డ వాహనాలను రోడ్లపై తిరగకుండా నివారించడం, మితిమీరిన వేగం, కొత్తటెక్నాలజీ వాహనాలను ఉపయోగించడం, వాహనాల వేగం పరిమితం చేయడం, విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై చర్చించారు.
ప్రమాదాల నివారణలో దేశంలోనే మొదటిస్థానంలో తెలంగాణ ఉన్నప్పటికీ, ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు అన్నికోణాల్లో పరిశీలించి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి, ముఖ్యమంత్రికి అందచేస్తామన్నారు. జనవరి మొదటి వారంలో రహదారి భద్రతా వారంగా పరిగణిస్తున్నామని, ఆలోగా మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశం నిర్వహించి, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం