తెలంగాణ

హైదరాబాద్‌లో తగ్గిన చైన్‌స్నాచింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లు తగ్గాయి. 2014లో చైన్ స్నాచింగ్‌ల కేసులు 425 నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్ వరకు 55 వరకు మాత్రమే జరిగాయి. మూడేళ్లలో 90 శాతం మేరకు కేసులు తగ్గాయి. 2014 కంటే 2015లో కొంత తగ్గుదల, 2016లో మరింత తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఏడాది పదకొండు నెలల్లో మెరుగైన ఫలితాలు రావడంతో పోలీస్ శాఖకు మంచి పేరు వచ్చింది. ఇంత మొత్తంలో స్నాచింగ్‌ల్లో తగ్గుదతల కనిపించడం వెనుక పోలీసుల కృషి ఉందని రూఢీ అయింది. ఇంత ప్రశాంతమై వాతావరణం హైదరాబాద్‌లో నెలకొని ఉందంటే నాటి నగర పోలీస్ కమిషనర్, ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, కృషి ఫలితమేనని చెప్పవచ్చు. సిబ్బందిపై నిరంతరం పర్యవేక్షణ, టెక్నాలజీపై వారికి పూర్తి అవగాహన కల్పిస్తూ, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడంతోనే సత్ఫలితాలు సాధించారు. స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట ముఠాలు స్నాచింగ్‌లకు ఎక్కువగా పాల్పడేవి. ఈ ముఠాలను గుర్తించి వారిని అరెస్టు చేయడంతోపాటు గొలుసు దొంగలపై పీడీ యాక్టు ప్రయోగించారు. ఇలాంటి కఠిన చర్యలతో నేరస్తులు హైదరాబాద్ వైపు చూడాలంటే భయపడుతున్నారు.
సీసీ కెమెరాలతో నిఘా
హైదరాబాద్ నగరంలో దాదాపు 1.5 లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం హైదరాబాద్‌ను క్రైం ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు సంకల్పించింది. ఆ దిశగానే పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటూ, వారికి కావలసిన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తోంది. నగరంలో స్నాచింగ్‌లు జరగడానికి కారణాలు? ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి? వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యరపై నగర పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా సిబ్బందికి సూచనలు చేశారు. దీంతో పాటు టెక్నాలజీ వాడుకున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి సీసీ కెమెరాల ఏర్పాటులో భాగస్వాములను చేశారు. నగరంలో స్నాచింగ్ జరిగిందంటే..ఆ ముఠా ఎక్కడున్నా పట్టుకొచ్చే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట ముఠాలన ఆయా రాష్ట్రాల్లో నగర టాస్క్ఫోర్స్, సీసీఎస్, శాంతిభద్రతల పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరస్థులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో స్నాచింగ్‌లు చేయాలంటే ముఠాలు ఎంతో భయపడుతున్నాయి.
హైవైడీ కాప్‌యాప్ సహకారం
ఓ పక్క సీసీ కెమెరాలు, మరో పక్క తక్షణమే స్పందించే పోలీస్ సిబ్బంది. దీనికి తోడు స్నాచింగ్‌లు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై విశే్లషణ చేసి, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి సూచిస్తున్నారు. ఇందుకు హైదరాబాద్ (హెచ్‌వైడీ) కాప్ యాప్‌లోని క్రైం మ్యాపింగ్ ఎంతో ఉపయోగపడుతోంది. నేరం జరిగిన వెంటనే అక్కడే ఎందుకు జరిగిందనే విషయాన్ని ఈ యాప్‌లో క్రైం అనాలటిక్స్ ద్వారా విశే్లషిస్తారు. గతంలో అక్కడ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయా? అని ఆరా తీస్తారు. పెట్రోలింగ్ మొబైల్, బ్లూకోట్స్‌ను అప్రమత్తం చేస్తూ నిరంతరం విజుబుల్ పోలీస్ ఉండే విధంగా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి చర్యలే హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్‌లకు అడ్డుకట్ట వేయగల్గుతున్నాయని చెప్పవచ్చు.