తెలంగాణ

జెసి, గఢా అధికారులపై.. సిఎం కెసిఆర్ ఫైర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, ఏప్రిల్ 28: ఒకరిద్దరు నాయకులు చెప్పే మాటలు వినిపించుకుని ప్రజా సమస్యలను పక్కన పెట్టడం బాగాలేదని సంయుక్త కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, గజ్వేల్ అభివృద్ధి అథారిటీ అధికారి (గఢా)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు ముగించుకుని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న సిఎం గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఉన్న నర్సన్నపేట గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు.
కూడవెల్లి వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంలను కూడా సిఎం పరిశీలించారు. నర్సన్నపేట గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కొన్నింటిని కూల్చివేయకుండా వదిలిపెట్టడంపై గడా అధికారితో ఆరా తీసి ఎందుకు కూల్చివేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రామంలో వంద శాతం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని సూచించారు. ఇళ్ల్ల నిర్మాణం పనులను వేగవంతం చేసి పూర్తి చేయించాలని ఆదేశించారు. గ్రామానికి చెందిన రాంచందర్ జగదేవ్‌పూర్ జడ్పీటిసిగా ఉండి కూడా గ్రామంలో కొంతమందిని ఇబ్బందులకు గురిచేయకూడదని మందలించారు. రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలనే కాంక్షిస్తూ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుంటే ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. ప్రజలకు జవాబుదారిగా సేవలు అందించాలని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదంటూ హితవు పలికారు. కూడవెల్లి వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం వల్ల 120 ఎకరాల భూమిని కోల్పోతున్న నర్సన్నపేట గ్రామ రైతులకు అందిస్తున్న పరిహారాన్ని కూడా సిఎం ఈ సందర్భంగా పెంచుతున్నట్లు రైతులకు భరోసా ఇచ్చారు. ఎకరానికి 4.80 లక్షలుగా పరిహారం అందించేందుకు అధికారులు నిర్ణయించగా అందుకు అదనంగా మరో 70 వేలు జతచేసి ఎకరాకు 5.50 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని గఢా అధికారి హన్మంతరావు, జెసి వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రాస్‌ను ఆదేశించారు.