తెలంగాణ

రైతుల గోడు పట్టించుకోని కేసీఆర్ సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 12: తీవ్రమైన కరవుతో రైతులు అల్లాడిపోతున్నా వారి గోడును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగం మాట్లాడుతూ అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పత్తి, మొక్కజొన్న, కంది, వరి పంటలను పండించిన రైతులకు అప్పు లు మిగిలి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేఎల్‌ఐ ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాల వల్లనే నేడు పూర్తి స్థాయిలో నీరు రావడం లేదన్నారు. కాలువల సామర్థ్యం పూర్తిగా తగ్గించిందని, రిజర్వాయర్ల ఊసేలేదన్నారు. కేఎల్‌ఐలోని మూడు లిఫ్టులలో ఐదు మోటార్లను ఒకేసారి ఎందుకు నడపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈపీసీ పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరంలేదని, కానీ కాంట్రాక్టు కంపెనీ ఏజెన్సీతో కుమ్మక్కై కాలువ ఎత్తు పెంపు పేరుతో అదనంగా నిధులు వెచ్చించి, టెండర్లను పిలిచారన్నారు. ఏజెన్సీలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పనులను చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొదటి లిఫ్టులో ఇంకా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకముందే పనులు చేపట్టడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేఎల్‌ఐ మొదటి లిఫ్టుకు 300 మీటర్ల దూరంలో అండర్ గ్రౌండ్ పంపుహౌస్ నిర్మాణం వల్ల కేఎల్‌ఐ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం ఏర్పడిందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల ఒత్తిళ్లకు లొంగి పనులు చేపట్టిందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో కేఎల్‌ఐ ప్రాజెక్టు లక్ష్యం దెబ్బతింటుందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోల్సి వస్తోందన్నారు. కేఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టులపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే అన్ని డాక్యుమెంట్లతో సహా జిల్లాకు జరిగే నష్టాన్ని వివరిస్తానని అన్నారు. అధికార పార్టీ నేతలు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం రైతుల నోట్లో మట్టికొడుతున్నారని, డిండి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవకముందే పనులు చేపట్టడం ఇందుకు నిదర్శనమన్నారు. కాలువలను తవ్వడంతో కేఎల్‌ఐ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్నారు.
రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నా మం త్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, వీటిపై తాను పోరాడుతానని స్పష్టం చేశా రు. పాదయాత్రలు కాదు, తీవ్ర నిరాశతో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వంపై పోరాడాలని, ఎండిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నేతలు అర్థం రవి, కాశన్న, వెంకట్రాములు, లక్ష్మీనారాయణ, నసీర్ తదితరులు పాల్గొన్నారు.