తెలంగాణ

కదిలిన శ్రీమంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఏప్రిల్ 28: ప్రముఖ సినీ హీరో, ప్రిన్స్ మహేష్‌బాబు తాను దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం సిద్దాపూర్ గ్రామంపై ఎట్టకేలకు దృష్టి సారించారు. ‘దత్తత ఉత్తిదే’ శీర్షికన ఆంధ్రభూమిలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఉచిత వైద్య శిబిరంతో గ్రామ సంక్షేమం వైపు అడుగులు వేశారు. ఇందులో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మహేష్‌బాబు ఛారిటబుల్ ట్రస్ట్, హీల్ ఏ చైల్డ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహేష్‌బాబు దత్తత తీసుకున్న గ్రామంలో మొట్టమొదటిసారిగా మహేష్‌బాబు ఛారిటబుల్ ట్రస్ట్, హీల్ ఏ చైల్డ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కంటి, చెవి, ముక్కు, గొంతు తదితర వాటికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను సరఫరా చేశారు. వైద్య పరీక్షలు అవసరం ఉన్న వారిని హైదరాబాద్‌కు రావాలని గ్రామస్థులకు సూచించారు. ఈ శిబిరంలో 300 మంది బాల బాలికలకు వైద్య పరీక్షలు చేసి మందులను అందజేశారు. అలాగే ఈనెల 29వ తేదీన సిద్దాపూర్ గ్రామంలో రెయిన్ బో ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా హెల్త్ క్యాంపునకు సినీ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నట్లు సమాచారం. గ్రామంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకునున్నట్లు సమాచారం. మహేష్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ వస్తున్నట్లు గ్రామస్థులకు తెలియడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు తమ సమస్యలు తీరుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దత్తత తీసుకున్నప్పటి నుండి సినీ హీరో మహేష్‌బాబుకు సంబంధించిన వారు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో కొంతమేరకు నిరాశకు గురైనప్పటికీ గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ దత్తత గ్రామం సిద్దాపూర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లేనని ప్రజలు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సమ్మ, ఎంపిటిసి సభ్యురాలు బాలయ్య, ఎంపిడివో భగవాన్‌రెడ్డి, హీల్ ఏ చైల్డ్ ట్రస్ట్ చైర్మన్ అనిల్‌తో పాటు వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.