తెలంగాణ

టిఆర్‌ఎస్‌లోకి ఉమా మాదవరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: టిడిపి సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాదవరెడ్డి, ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో తమ అనుచరులతో కలిసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్టు ఉమా మాదవరెడ్డి ప్రకటించారు. మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఉమా మాదవరెడ్డి తన కుమారుడితో కలిసి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. టిఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని వారు తమ మనోగతాన్ని వెల్లడించగా ముఖ్యమంత్రి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో వీరి చేరికకు ఈ నెల 14న తెలంగాణ భవన్‌లో మూహుర్తాన్ని ఖరారు చేసారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, బంగారు తెలంగాణ దిశగా చేస్తున్న కృషికి ఆకర్షితులమై టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఉమా మాదవరెడ్డి మీడియాకు తెలిపారు.