తెలంగాణ

తెలుగు మహాసభల కరదీపిక ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభలను వైభవోపేతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రధాన చౌరాస్తాల్లో తోరణాల ఏర్పాటు కూడా ప్రారంభమైందని, ఎల్బీస్టేడియంలో ప్రధాన కార్యక్రమం జరిగే పాల్కురికి సోమన ప్రాంగణంలో బమ్మెర పోతన వేదిక సిద్ధమైందని అన్నారు. మంగళవారం సాయంత్రం కడియం శ్రీహరి ఇతర అధికారులతో కలిసి ఐదు రోజుల కార్యక్రమాల 56 పేజీల కరదీపికను సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలకు నిర్వహణ కమిటీ, ఏర్పాట్ల కమిటీలకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కరదీపికను రూపొందించామని అన్నారు. 15వ తేదీ నుండి 19వ తేదీ వరకూ జరిగే మహాసభలకు ప్రధాన వేదిక ఎల్బీస్టేడియంతో పాటు ఆరు ఉప వేదికలు ఉంటాయని అన్నారు. ఈ వేదికల్లో జరిగే అన్ని కార్యక్రమాలను కరదీపికలో చేర్చామని చెప్పారు. సభల్లో పాల్గొనే వారందరికీ ఆహ్వాన పత్రికలను అందిస్తున్నామని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో అంతా స్వేచ్ఛగా పాల్గొనాలని చెప్పారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు. సభల్లో పేర్లు నమోదుచేసుకోని వారు కూడా పాల్గొనవచ్చని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఇది తెలుగు పండుగ, తెలంగాణ గుండె నిండా జరిగే పండుగ అని అన్నారు.
కార్యక్రమాలు
15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభ కార్యక్రమం, 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగింపు కార్యక్రమాలు ఎల్బీస్టేడియం బమ్మెర పోతన వేదికపై జరుగుతాయి. ప్రారంభ కార్యక్రమానికి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ సి హెచ్ విద్యాసాగరరావు, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వేదికపై ఆశీనులవుతారు. ముగింపు కార్యక్రమానికి రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరవుతారు. ప్రధాన వేదిక ఎల్బీస్టేడియంలో 15వ తేదీన సాంస్కృతిక సమావేశం, 16న సాహిత్య సభ, 17న వౌఖిక వాజ్ఞయం, 18న తెలంగాణ పాట, 19న ముగింపు కార్యక్రమాలుంటాయి. తెలుగు యూనివర్శిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో 16న పద్యకవితా సౌరభం, వచన కవితా వికాసం, 17న కథా సదస్సు, నవలా సాహిత్యం, కథా- నవలా రచయితల గోష్టి, 18న తెలంగాణ విమర్శ- పరిశోధన, శతక- సంకీర్తన- గేయ సాహిత్యం, కవిసమ్మేళనం జరుగుతాయి. 19న తెలంగాణలో తెలుగు అంశంపై చర్చ జరుగుతుంది. రవీంద్రభారతిలో 16 నుండి అష్టావధానం, హాస్యావధానం, పద్యకవి సమ్మేళనం, జంటకవుల అష్టావధానం, అక్షర గణితావధానం, నేత్రావధానం, 18న పత్రికలు -ప్రసార మాధ్యమాల్లో తెలుగు అనే అంశంపై చర్చ జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం న్యాయ పరిపాలనా రంగాల్లో తెలుగు అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవిసమ్మేళనం పేరిట 9 సమావేశాలు జరుగుతాయి. రవీంద్రభారతి మినీలో బాలసాహిత్యం, బాల కవి సమ్మేళనం, మహిళా సాహిత్యం, కవయిత్రుల సమ్మేళనం, విదేశీ తెలుగు వారు, రాష్ట్రేతరులతో ముఖాముఖి జరుగుతాయి. సారస్వత పరిషత్‌లో శతావధానం జరుగుతుంది, ప్రివ్యూథియేటర్‌లో యువ చిత్రోత్సవం , మాదాపూర్ చిత్రమయి ఆర్టు గ్యాలరీలో ఛాయా చిత్ర ప్రదర్శన జరుగుతాయి.

చిత్రం..తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ముస్తాబవుతున్న అసెంబ్లీ రోడ్డు