తెలంగాణ

రాష్ట్రానికో కొత్త పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీ జహీరాబాద్ నిమ్జ్‌లో 500 ఎకరాల్లో ఏర్పాటు
శ్రేయి ఇన్‌ఫ్రాస్టక్చర్‌తో తెలంగాణ ఒప్పందం పదేళ్లలో 10 వేలమందికి ఉద్యోగాల కల్పన

హైదరాబాద్, డిసెంబర్ 13: వౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీకి దేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణలో పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఐటీ మంత్రి కె తారకరామారావు తెలిపారు. భవన నిర్మాణాలు, ప్రాజెక్టులు, మైనింగ్ వంటి వౌలిక వసతులకు ఉపయోగించే పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ఈ పార్క్ ఏర్పాటుకు శ్రేయి ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీతో బుధవారం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్‌లో నేషనల్ ఇనె్వస్టిమెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌లో (నిమ్జ్) ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి కేటీఆర్ వివరించారు.
ఈ పార్క్‌లో వచ్చే పదేళ్ల వ్యవధిలో సుమారు 10 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఈ పార్క్‌కు సంబంధించి భూసేకరణ ఇప్పటికే పూరె్తైందని, త్వరలో లాంఛనంగా శంకుస్థాపన చేయబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇలాఉండగా బెంగళూరులో బుధవారం జరిగిన ఎక్స్‌కాన్-2017 సదస్సును కర్నాటక రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి ఆర్వీదేశ్‌పాండేతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సదస్సును హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయాల్సిందిగా నిర్వహకులను మంత్రి కెటిఆర్ కోరారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలు, నూతన పారిశ్రామిక విధానం ద్వారా అనేక పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. రవాణాపరంగా తెలంగాణ, దేశానికి మధ్యలో ఉండటం వల్ల దేశం నలుమూలల నుంచి ఇక్కడికి సరుకుల రవాణా సులభతరంగా ఉంటుందని మంత్రి సూచించారు. వౌలిక వసతుల యంత్ర పరికరాల కొనుగోలులో తెలంగాణ ఇప్పటికే అగ్రస్థానంలో ఉందని మంత్రి గుర్తు చేసారు.