తెలంగాణ

అతిథులకు అసౌకర్యం లేకుండా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేయడంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంతృప్తిని వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆయన ప్రపంచ సభల ప్రారంభ కార్యక్రమం జరిగే ఎల్‌బి స్టేడియంను సందర్శించి అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి, భాష సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటేలా ప్రపంచ సభలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రారంభ కార్యక్రమంలో వివిఐపిలకు, విఐపిలకు, కార్యక్రమాల్లో ముఖ్య అతిథులకు, రాష్ట్రేతర ప్రాంతాల నుండి వచ్చే అతిథులకు, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ప్రధాన వేదికపైన ఎల్‌బి స్టేడియంలో ప్రారంభ రోజు నిర్వహించే బాణాసంచా, లేజర్ షోల నిర్వహణపై కూడా ఆయన చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, శాసనమండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నే ప్రభాకర్, స్పోర్ట్సు చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, మహాసభల కోర్ కమిటీ సభ్యులు ఎస్ వి సత్యనారాయణ, ఆయాచితం శ్రీ్ధర్, ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశం, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, స్పోర్ట్సు ఎండి దినకర్ బాబు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సభలను ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తోందని చెప్పారు. వేర్వేరు వేదికలపై నిర్వహించే సభల కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులేనని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్టు చెప్పారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా ఏర్పాట్లను సమీక్షించి ఆదేశాలు ఇచ్చారని, తదనుగుణంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సభలకు దేశ, విదేశాల నుంచి 8 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోందని, నేరుగా, ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న ప్రతినిధుల సంఖ్య సోమవారం నాటికి 8 వేలకు చేరుకుందని చెప్పారు. హాజరయ్యే ప్రతినిధులు పాల్గొనే వేదికలు, సౌకర్యాలను స్వయంగా వారితో మాట్లాడి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, తదనుగుణంగానే వారితో సంప్రదించి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అలాగే సభలకు జిల్లాల నుంచి హాజరయ్యే తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు, రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులకు రవాణా, భోజన సౌకర్యాలను సంబంధిత కలక్టర్లు కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మహాసభలకు హాజరయ్యే టీచర్లు, అధ్యాపకులకు ఆన్‌డ్యూటీ సదుపాయం కల్పించామని, సభలకు హాజరై రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఆన్‌డ్యూటీ వర్తిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని, హాజరయ్యే ప్రతినిధులను తగిన విధంగా గౌరవించాలని సూచించారు. ఇప్పటికే కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తూ కరదీపికను విడుదల చేశామని అన్నారు. మహాసభల ప్రారంభ, ముగింపు రెండు ప్రధాన ఘట్టాలు నిర్ణయాత్మకంగా, నిర్ణీతంగా ఉండాలని సిఎం సూచించారని, ఇది బహుముఖ కార్యక్రమం కావడంతో ఎక్కడా లోటు రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కడియం పేర్కొన్నారు.