తెలంగాణ

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టుకథలతో కోర్టుకు వెళుతున్నారు
లక్నారం బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు ధ్వజం

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 13: రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఆపేందుకు కట్టుకథలతో కోర్టులకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని లక్నారంలో బుధవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నిర్వహించిన జల విజయ పాదయాత్ర ప్రారంభోత్సవ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గండు పిల్లులు లేనిచోట పెద్ద పులులు ఉన్నట్లు చూపి, తుమ్మచెట్లు లేని చోట అటవీ ప్రాంతం ఉన్నట్లు చూపి కాంగ్రెస్ నాయకులు కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన హర్షవర్ధన్‌రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను అటవీ ప్రాంతంలో చేపట్టారని, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారని, దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి 123 జీవోను రద్దు చేయాలని కోర్టులో కేసు వేసి కర్వెనా రిజర్వాయర్‌ను ఆపే ప్రయ త్నం చేశారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎన్నికల సమయంలోనే ఓట్లు దండుకోవడానికి కేఎల్‌ఐ ప్రాజెక్టును చూపించారని, కేఎల్‌ఐని ఓట్ల ప్రాజెక్టుగా చేసిన ఘనత ఆ రెండు పార్టీలకే దక్కుతుందని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేఎల్‌ఐపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూ.1300 కోట్లు ఖర్చు చేసి వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. సర్జ్ఫిల్‌ల వద్ద నిద్రచేసి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. కాలువలు మాత్రమే తవ్వి మోటార్ల గురించికానీ, సర్జ్ఫిల్ గురించి పట్టించుకోలేదని, ఏడేళ్ల క్రితం కొన్న మోటార్లలో స్పేర్‌పార్ట్స్ కూడా లేవన్నారు. కేఎల్‌ఐని పెండింగ్ ప్రాజెక్టుగా కాంగ్రెస్, టీడీపీ మార్చితే టీఆర్‌ఎస్ రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి పూర్తిచేసిందన్నారు. రెండో లిఫ్టు వద్ద, ఆవంచ బ్రిడ్జి వద్ద రేయింబవళ్లు పను లు చేసి కల్వకుర్తి నియోజకవర్గానికి ఈ యేడాది నీళ్లు ఇచ్చి 30 చెరువులను నింపా మన్నారు. కేఎల్‌ఐ కాలువ వెంట నడిచి ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో మరమ్మతులకు ఎక్కడెక్కడ సమస్యలున్నాయో తెలుసుకునేందుకు 165 కిలోమీటర్ల పాదయాత్ర చేయ డం అభినందనీయమన్నారు. రైతులు పండించిన వేరుశనగ, వరి కొనుగోలు కోసం పెద్ద మార్కెట్ అవసరమని, నాగర్‌కర్నూల్‌లో 42 ఎకరాల విస్తీర్ణంలో రూ.8 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త మార్కెట్ యార్డును వేగవంతంగా పూర్తి చేసి వచ్చే యాసంగి పంటలను కొనుగోలు చేస్తామని ఆయన ప్రకటించారు. కొత్త పంట, కొత్త మార్కెట్‌యార్డు నినాదంతో వెళ్తామన్నారు. తెలకపల్లి మార్కెట్‌యార్డు అభివృద్దికోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీచైర్మన్ బండారి భాస్కర్, మాజీ మంత్రి పి.రాము లు, నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, బైకాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.