తెలంగాణ

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: రాజధాని నగరంలోని పాతబస్తీలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. అక్రమ దందాకు పాల్పడుతున్న ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే ఓపియమ్ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఖయ్యూం ఉల్లాఖ్, మధ్యప్రదేశ్‌కు చెందిన చందన్ నవీన్ కలసి నగరంలో డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నారు. వీరిని పురానాపూల్‌లో మూడు కిలోల ఓపియమ్ డ్రగ్స్‌తో పట్టుకున్నామని సౌత్‌జోన్ పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సలీమ్ ద్వారా వీరిద్దరికి డ్రగ్స్ సరఫరా అయిందని విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురు పలు కేసుల్లో ముద్దాయిలుగా చంచల్‌గూడ జైల్లో కూడా ఉండగా అప్పుడే వీరు స్నేహితులయ్యారు. ముఠాలోని మరో నిందితుడు సలీమ్‌ను త్వరలో అరెస్టు చేస్తామని సౌత్‌జోన్ అదనపు డిసిపి కోటిరెడ్డి తెలిపారు.