తెలంగాణ

వ్యవసాయానికి 24 గంటలు సరఫరా చేసినా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేసినా, రానున్న వేసవిలో విద్యుత్ కొరతకు అవకాశం లేదు. మూడేళ్ల క్రితం విద్యుత్ కొరతతో సతమతమైన తెలంగాణ ఈ రోజు మిగులు విద్యుత్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తే పారిశ్రామిక, గృహ రంగాలకు కోతలు తప్పవనే ఆందోళనలు ఉండవని విద్యుత్ నిపుణులంటున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు ఉండదని బట్టలు ఆరేసుకోవాల్సివస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2004 ఎన్నికల సమయంలో అన్న విషయంవిదితమే. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ విధంగానే 2004 నుంచి 2017 వరకు రాష్ట్రం విభజన జరిగినా రెండు రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. ఈ స్కీం జోలికి వెళ్లే సాహసం ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు. కాగా తెలంగాణరాష్ట్రం అవతరించిన తర్వాత 2014లో తొలి నాళ్లలో కొన్ని నెలల పాటు విద్యుత్ కొరత తలెత్తింది.
కాని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దూరదృష్టి, పారదర్శకత, సమర్థత వల్ల ఉచిత విద్యుత్ 24 గంటలకు పెంచారు. ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం కొన్ని జిల్లాల్లో అమలుచేస్తే సత్ఫలితాలు వచ్చాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుంచి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్స్‌ను పటిష్టం చేశారు. కొత్త పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను అప్‌గ్రేడ్ చేశారు. రెండు వారాల పాటు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌లో తలెత్తిన కొన్నిసాంకేతిక సమస్యలను తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సంస్ధలు పరిష్కరించాయి. ప్రస్తుతం రబీ సీజన్ చురుకుగా సాగుతోంది. మొత్తం 12.8 లక్షల హెక్టార్లకు 25 శాతం నాట్లు పడ్డాయి. వచ్చే నెలాఖరునాటికి రబీ సీజన్ పీక్ దశకు చేరుకుంటుంది. నవంబర్ నెలలో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేసినప్పుడు విద్యుత్ డిమాండ్ 7 వేల మెగావాట్లకుచేరుకుంది. ఈ నెలలో 7500 మెగావాట్ల నుంచి 8వేల మెగావాట్లకు చేరుకున్నట్లు విద్యుత్‌నిపుణులు గమనించారు. కాగా జనవరి నుంచి చలి తగ్గి, మెల్లిగా వేసవి తొలిదశ ప్రారంభమవుతుంది. వచ్చే మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 12వేల మెగావాట్లకు చేరుకుంటుందని అటంచనా. 11వేల మెగావాట్లకు చేరుకున్నా, తట్టుకునే శక్తి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఉంది. ముందు జాగ్రత్తచర్యగా రోజుకు ఐదు వందల మెగావాట్ల నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌నుకొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందం మే నెలాఖరు, జూన్ వరకు ఉంటుంది. యూనిట్ విద్యుత్ రూ.4.10 పైసలు చొప్పున కొనుగోలు చేయననున్నారు. కొత్తగూడెం, భద్రాద్రి థర్మల్ విద్యుత్ స్టేషన్ల నుంచి అదనంగా విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. విద్యుత్ కొరత ఎటువంటి పరిస్థితుల్లో ఉండదని, ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసినట్లు విద్యుత్ సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.