తెలంగాణ

కన్స్యూమర్ ఫోరంలకు అధ్యక్షుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు జిల్లా కన్స్యూమర్ ఫోరం అధ్యక్షులను ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్ జిల్లా కన్స్యూమర్ ఫోరం అధ్యక్షుడిగా రిటైర్డ్ జిల్లా జడ్జి కె. రమేష్‌ను నియమించారు. హైదరాబాద్-2 జిల్లా ఫోరం అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది వక్కంటి నరసింహారావును, రంగారెడ్డి జిల్లా ఫోరం ప్రెసిడెంట్‌గా చిట్నేని లలితా కుమారిని నియమించారు. జిల్లా కన్స్యూమర్ ఫోరం ప్రెసిడెంట్లుగా నియామకం అయినవారు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఐదేళ్లపాటు లేదా వారికి 65 సంవత్సరాలు నిండేంత వరకు ఈ పదవిలో ఉంటారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీఐటీయూ

హైదరాబాద్, డిసెంబర్ 13: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణకు ఎలాంటి నిర్ధిష్ట చర్యలు తీసుకోవడం లేదని సిఐటియు నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులు జె.వెంకటేశ్, రాష్ట్ర నాయకులు ఎస్.రమ, సుధాకర్, సహాయ కార్యదర్శి జె.కుమారస్వామి, కోశాధికారి ఆర్.వాణి, కార్యదర్శి వెంకటేశ్‌లు ప్రకటన విడుదల చేశారు. మోదీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో ఈజ్ ఆఫ్ లూటింగ్‌కు పాల్పడుతోందని విమర్శించారు. ఇక ధరల నియంత్రణలో ప్రభుత్వం కూడా విఫలమైందని అన్నారు.

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా గ్రూపు 1,2,3,4 సర్వీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయించాలని తెలంగాణ నిరుద్యోగ జెఎసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ నిరుద్యోగ జెఎసి చైర్మన్ నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన బుధవారం జరిగిన నిరుద్యోగ గర్జన సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ విషయంలో పట్టిష్టమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలని సూచించారు. గ్రూపు-1లో 1200 ఉద్యోగాలు, గ్రూపు-2 సర్వీసులో 2 వేలు, గ్రూపు-3లో 8 వేల ఉద్యోగాలు, గ్రూపు-4లో క్లరికల్ ఉద్యోగాలు 35 వేల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ఉద్యోగాలు, డాక్టర్, పారామెడికల్ ఇతర టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయని ఆయన విమర్శించారు.

ప్రాజెక్టుల పరిథిలోకి వెళ్ళే అటవీ భూములకు ‘ ప్రత్యామ్నాయంగా అడవులు పెంచాలి’

హైదరాబాద్, డిసెంబర్ 13: అడవుల రక్షణకు, పచ్చదనం పెంపునకు ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలని విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారులు, రాష్ట్ర అటవీ శాఖ అధికారులు కింది స్థాయి సిబ్బందికి సూచించారు. బుధవారం అరణ్య భవన్‌లో నిర్వహించిన వర్క్ షాప్‌లో విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారులు పలువురు హాజరయ్యారు. అడవుల రక్షణ, హరితహారం, ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులకు అటవీ అనుమతులు ఏకో టూరిజం ప్రాజెక్టులు, అర్బన్ పార్కులు, అటవీ పునరుజ్జీవన అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై సమావేశంలో వారు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సాగు నీటి, తాగు నీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున అటవీ భూముల బదలాయింపులు జరుగుతన్నందున ప్రత్యామ్నాయ భూముల్లో అడవుల పెంపకం చేపట్టాలని వారు సూచించారు. ఇలాఉండగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పికె ఝూ అటవీ శాఖ తరపున చేపట్టిన వివిధ పథకాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. గూగుల్ మ్యాపుల ద్వారా అటవీ భూముల అక్రమణలను అరికట్టవచ్చన్నారు. ప్రతి అటవీ అధికారితో పాటు సిబ్బంది కూడా తమకు కేటాయించిన అటవీ ప్రాంతాల్లోనే నివాసం ఉంటే వేట నియంత్రణ, చెట్ల నరికివేత, స్మగ్లింగ్‌ను నిరోధించవచ్చని ఆయన తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో బినామి వ్యవస్థను రద్దు చేయాలి

హైదరాబాద్, డిసెంబర్ 13: బిఎస్‌ఎన్‌ఎల్‌లో బినామి వ్యవస్థను రద్దు చేయాలని, పదేళ్ల సర్వీస్ కలిగిన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ బిఎన్‌ఎన్‌ఎల్ కాంట్రాక్ట్, క్యాజువల్ ఎంప్లాయిస్, లేబర్ యూనియన్ ధర్నా నిర్వహించింది. హైదరాబాద్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ భవన్ ముందు బుధవారం జరిగిన ధర్నాలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.మధు మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పేర్లు కూడా రికార్డుల్లో లేకుండా బినామి పేర్లతో కనీస వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటుందని తక్షణమే బినామి వ్యవస్థను రద్దు చేసి పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

‘పంచాయతీ చట్టంలో సవరణలు చేయండి’

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టంలో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నందున పంచాయతీల పరిపుష్టి, గ్రామ స్వరాజ్య బలోపేతమే లక్ష్యంగా విధి, విధానాలు రూపొందించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ చట్టం సవరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అందుకు భిన్నంగా ఉందని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాకుండా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న రీతిలో పంచాయతీ చట్ట సవరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు.