తెలంగాణ

అన్నింటినీ కరవు మండలాలుగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటి (టిజెఎసి) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. టిజెఎసి ఆధ్వర్యంలో కరవు పరిస్థితులపై గురువారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ కరవుపీడిత గ్రామాలలో మంచి నీటి సరఫరాకు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. పశువులకు నీరు, పశుగ్రాసం అందుబాటులోకి తేవాలన్నారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సెలవుదినాలతో నిమిత్తం లేకుండా కొనసాగించాలని సూచించారు. అన్ని మండలాలను కరవుమండలాలుగా గుర్తించాలని కోరుతూ టిజెఎసి శనివారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడికి త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని వివరించారు. ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య మాట్లాడుతూ గ్రామాల్లో తీవ్ర కరవు నెలకొందని, 60శాతం మంది వలసలు వెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంతో నీరసించిన ప్రజలు ఉద్యమాలకు సిద్ధంగా లేరని, కేవలం రాజకీయ నాయకుల వద్ద యాచక వృత్తిని ఎంచుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కరవు నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ కరవుప్రకృతి వైఫల్యం కాదని, మానవ వైఫల్యమేనన్నారు. ప్రతిపక్షాలు బలహీనమైనప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా మారాలని పేర్కొన్నారు.